Nithiin: జయం, గుండెజారి గల్లంతయయ్యిందే, ఇష్క్,దిల్, సై వంటి ఎన్నో సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరిగా ఎదిగారు నితిన్. ఈయన మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ అవ్వడంతో నితిన్ కి ఇండస్ట్రీలో తిరుగులేకుండా పోయింది.అంతే కాకుండా ఈయన తండ్రి సుధాకర్ రెడ్డి నైజాం డిస్ట్రిబ్యూటర్ కావడంతో సినిమాల్లో మరిన్ని అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా తన యాక్టింగ్, డాన్స్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈ హీరో గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Nithiin failure love story 2 times breakup
నితిన్ కి ఇండస్ట్రీలో రెండు సార్లు లవ్ ఫెయిల్ అయిందని,ఇండస్ట్రీలో ఉన్న ఇద్దరికీ హీరోయిన్లను ప్రేమించి కొన్ని కారణాల వల్ల బ్రేకప్ చెప్పారనే టాక్ వినిపించింది.అయితే నితిన్ కి సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్ తో ప్రేమ అనగానే అందరికీ టక్కున నిత్యమీనన్ గుర్తుకొస్తుంది.. నిత్యామీనన్,నితిన్ కాంబినేషన్లో గుండెజారి గల్లంతయ్యిందే, ఇష్క్ వంటి సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాల్లో చేసే సమయంలో నితిన్ కి నిత్యమీనన్ కి మంచి పరిచయం పెరిగి పెళ్లి చేసుకోవాలి అనుకున్నారట. (Nithiin)
Also Read: Naga Babu: వాళ్ళు ఎందుకు పనికిరారు.. బన్నీ, తారక్ లపై నాగబాబు షాకింగ్ కామెంట్స్.?
కానీ నితిన్ అక్క నిఖిత మాత్రం నిత్యమీనన్ తో పెళ్లికి ఒప్పుకోలేదని, అందుకే ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగిందనే వార్తలు వినిపించాయి. ఇక మరో హీరోయిన్ మేఘా ఆకాష్.. నితిన్ మేఘా ఆకాష్ కాంబోలో కూడా రెండు సినిమాలు వచ్చాయి.. ఛల్ మోహన్ రంగా,లై.. ఈ రెండు సినిమాలు చేసే సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే లై సినిమాలో నటించే సమయంలో మేఘా ఆకాష్ ప్రేమలో పడ్డ ఈ హీరో తన నెక్స్ట్ సినిమాకి కూడా మేఘా ఆకాష్ ని తీసుకోమని డైరెక్టర్ కి రికమెండ్ చేయడంతో వీరిద్దరి మధ్య ఎఫైర్ వార్తలు వినిపించాయి.
అయితే నితిన్ కి మేఘా ఆకాష్ కి ఉన్న అనుబంధం వల్లే రెండు సినిమాలు కలిసి చేశారు అనే టాక్ వినిపించింది. అయితే వీరి మధ్య ప్రేమ కూడా ఎన్నో రోజులు నిలవలేదు. బ్రేకప్ జరగడంతో సినీ ఇండస్ట్రీలో నితిన్ కి రెండు సార్లు లవ్ ఫెయిల్యూర్ అయిందనే వార్తలు వచ్చాయి. కానీ చివరికి నితిన్ తన స్నేహితురాలు అయినటువంటి శాలినిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.(Nithiin)