Ravi Teja Daughter Mokshada Film Industry Journey

Ravi Teja Daughter: టాలీవుడ్ లో ఎనర్జిటిక్ హీరోగా పేరున్న మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. వయసు పెరుగుతున్నా, ఆయన ఉత్సాహం, స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. “మిస్టర్ బచ్చన్” మరియు “ఈగల్” వంటి చిత్రాల ద్వారా ఈ సంవత్సరం ప్రేక్షకులను అలరించిన రవితేజ, ప్రస్తుతం పలు కొత్త సినిమాల షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.తన రాబోయే సినిమాలతో అభిమానులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

Ravi Teja Daughter Mokshada Film Industry Journey

సినిమా షూటింగ్‌ల ఒత్తిడి నుంచి కొంత విరామం తీసుకుని, రవితేజ ఇటీవల కుటుంబంతో కలిసి విదేశ యాత్రకు వెళ్లారు. జపాన్, బ్యాంకాక్ వంటి దేశాలను సందర్శించిన ఆయన, ఆ యాత్రకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ యాత్రలో ఆయన భార్య కల్యాణి, కొడుకు మహాధన్, కూతురు మోక్షద మరియు ఇతర బంధువులు కూడా పాల్గొన్నారు. అయితే, అందరి దృష్టిని ఆకర్షించినది రవితేజ కూతురు మోక్షద. ఎంతో అందంగా, క్యూట్‌గా ఉన్న మోక్షద ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Also Read: Nagarjuna: చిరు చేయాల్సిన సినిమాను చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నాగార్జున.. చిన్న కారణంతో!!

సోషల్ మీడియాలో కొంత సమయంలో మోక్షద కనిపించడం అనేది సాధారణమే. ఆమె అందం మరియు స్టైలుతో అందరిని ఆకట్టుకుంటోంది. కొంతమంది ఆమె కూడా సినిమా రంగంలోకి ప్రవేశిస్తారని, హీరోయిన్ అవుతారని అనుకున్నారు. కానీ, మోక్షదకు హీరోయిన్ అవ్వాలని లేదట. ఆమె చిత్రసీమలో పని చేయాలని, నిర్మాతగా మారాలని నిర్ణయించుకుందని సమాచారం. ఆమె తనకంటూ ఒక స్వంత బ్యానర్ స్థాపించాలని అనుకుంటోంది.

తన కూతురి నిర్ణయానికి రవితేజ కూడా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. తన కూతురు సినిమా రంగంలో సక్సెస్ సాధించాలని, మంచి పునాది వేయాలని ఆయన కోరుకుంటున్నారు. మోక్షద నిర్మాతగా ఎలాంటి సినిమాలు తీస్తుందా? ఆమెకు ఎంత టాలెంట్ ఉంది అనేది త్వరలోనే కన్పిస్తుంది.