Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రం పైన ఆదాని కన్ను పడ్డట్టు తెలుస్తోంది. గత పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో… తెలంగాణ వైపు కూడా ఆదాని చూడలేకపోయాడు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత… గౌత‌మ్ అదానీ కన్ను మొత్తం తెలంగాణ పైనే పడిపోయింది. అయితే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 100 కోట్ల చెక్కు అందించారు… గౌత‌మ్ అదానీ. Revanth Reddy

Adani gave a check of Rs 100 crore to CM Revanth Reddy

స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి 100 కోట్ల చెక్కు అందించారు గౌత‌మ్ అదానీ. అయితే ఈ చెక్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాదు. తెలంగాణ ప్రభుత్వానికి సహాయం అందించేందుకు… హైదరాబాద్ వచ్చిన గౌత‌మ్ అదానీ.. 100 కోట్ల చెక్ ఇచ్చారు. ఈ 100 కోట్ల రూపాయలను… యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కోసం… ఖర్చు పెట్టాలని ఆదాని ఫౌండేషన్ నుంచి విరాళం ఇచ్చారు గౌత‌మ్ అదానీ. Revanth Reddy

Also Read: Janasena: జనసేన పార్టీలోకి బొత్స సత్యనారాయణ, వైసీపీ ఎమ్మెల్యేలు ?

రూ.100 కోట్ల విలువైన చెక్కును అంద‌జేసిన గౌత‌మ్ అదానీ… యంగ్ ఇండియా స్కిల్స్ యూనివ‌ర్శిటీని డెవలప్‌ మెంట్‌ చేయాలని కోరారు. దాదాపు 1 గంట పాటు సీఎం రేవంత్‌తో అదానీ గ్రూప్ సంస్థ‌ల చైర్మ‌న్ గౌత‌మ్ అదానీ మ‌ర్యాద‌పూర్వక భేటీ అయ్యారు. అయితే… సీఎం రేవంత్‌తో అదానీ గ్రూప్ సంస్థ‌ల చైర్మ‌న్ గౌత‌మ్ అదానీ మ‌ర్యాద‌పూర్వక భేటీ వెనుక వేరే కుట్ర ఉందని బీఆర్‌ఎస్‌ పార్టీ అంటోంది. తెలంగాణ రాష్ట్రంలో.. ఇద్దరు కలిసి ఏదో చేయబోతున్నారని బీఆర్ఎస్‌ నేతలు ఆగ్రహిస్తున్నారు. ఇక అటు రాహుల్‌గాంధీ మాత్రం.. అదానీ గ్రూప్ సంస్థ‌ల చైర్మ‌న్ గౌత‌మ్ అదానీ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. Revanth Reddy