Samantha Professionalism Shines in Eega

Samantha: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా రాణించడం కత్తిమీద సాము లాంటిదే. గ్లామర్ మాత్రమే కాదు విభిన్న పాత్రలను పోషించగల సత్తా ఉండాలి. అవసరానికి తగ్గట్టు భావోద్వేగాలను వ్యక్తపరచడం కూడా ఉండాలి. కొంతమంది నటీమణులు తమ కమిట్‌మెంట్‌కు కట్టుబడి ఎలాంటి పాత్రలు అయినా చేయడానికి సిద్ధంగా ఉంటారు, అయితే కొందరు కొన్ని సీన్లను చేయడానికి వెనుకాడతారు. సమంత ఈ రెండో కోవలోకి వస్తుంది.

Samantha Professionalism Shines in Eega

“ఏం మాయ చేసావే” సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించిన సమంత, తన అందం మరియు అభినయంతో టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి, విడాకులు వంటి వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులను అధిగమించినా, ఆమె ఇప్పటికీ నెంబర్ వన్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. అయితే, ఎంతో మంది అభిమానులను కలిగి ఉన్న సమంత కూడా కొన్ని సీన్లు చేయడంలో ఇబ్బందిపడ్డట్లు తెలుస్తోంది.

Also Read: Mahesh Babu: అభిమానుల మాటను మహేష్, రాజమౌళి వింటారా?

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “ఈగ” సినిమాలో, సమంతకు చాలా సీన్లలో బాధ, విచారం వ్యక్తపరచాల్సి వచ్చింది. సెట్లో సరదాగా ఉండే సమంతకు క్షణం క్షణం బాధగా నటించడం కష్టం అనిపించిందత. “నా వల్ల కాదు సార్, ఇలా బాధపడుతూ నేను నటించలేను” అని రాజమౌళికి చాలా సార్లు తెలిపిందట.

కానీ, రాజమౌళి తన నిర్ణయానికి వెనక్కి తగ్గలేదు. సమంత నుంచి తనకు కావాల్సిన ఎక్స్‌ప్రెషన్స్ పొందడానికి చాలా టేకులు తీసుకొన్నాడట. చివరికి రాజమౌళి కోరిన విధంగా సమంత ఆ సీన్స్‌లో నటించాల్సి వచ్చింది. “ఈగ” విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో, సమంత నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే, షూటింగ్ సమయంలో ఆమె ఎదుర్కొన్న కష్టాలను సమంత ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నట్టు తెలుస్తోంది. ఆ సినిమాలో సమంత నటన సినిమా విజయంలో ముఖ్యమైన భాగంగా నిలిచింది.