Upasana: ఉపాసన..ఈమె సినిమాల్లో నటించకపోయినా కానీ సినీ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ కి ఉండేటువంటి క్రేజ్ ఉంటుంది.. దీనికి ప్రధాన కారణం మెగా ఫ్యామిలీలో ఆమె కోడలిగా అడుగుపెట్టడమే అని చెప్పవచ్చు. అయితే ఉపాసన రాంచరణ్ చదువుకునే సమయంలోనే ప్రేమలో పడి ఆ తర్వాత ఈ కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అలా ఇద్దరు ఏకమైన తర్వాత దాదాపు 11 ఏళ్లకు సంతానం పొందారు. గత సంవత్సరం ఉపాసన రాంచరణ్ దంపతులకు పండంటి ఆడపిల్ల పుట్టింది..
The Upasana that shed tears for Surekha work in the new marriage
దీంతో మెగా ఫ్యామిలీలోకి లక్ష్మీదేవి అడుగు పెట్టిందని సంబరపడిపోతున్నారు. ఆ అమ్మాయికి క్లింకారా అని నామకరం చేశారు. కానీ సంవత్సరం గడిచినా ఇప్పటికి ఆ అమ్మాయి ఫేస్ ను మాత్రం ఎక్కడా రివీల్ చేయకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు.. ఈ విధంగా మెగా ఫ్యామిలీ లో అడుగు పెట్టిన తర్వాత ఎంతో పేరు సంపాదించుకున్న ఉపాసన ఆ ఒక్క టైం లో మాత్రం విపరీతంగా బాధపడిందట. కన్నీళ్లు కూడా పెట్టుకుందట. అది ఎవరివల్లా అంటే వారి సొంత అత్తమామల వల్ల అని ఒకానొక సమయంలో ఉపాసన తెలియజేసింది. కన్నీళ్లు పెట్టుకోవడానికి కారణం ఏంటి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. (Upasana)
Also Read: Dill Raju: దిల్ రాజు గేమ్ ఛేంజర్ నిర్ణయం వెంకీ కి నచ్చలేదా.. కోపంలో విక్టరీ!!
అయితే చాలామంది అత్త మామ టార్చర్ పెడితేనే కన్నీళ్లు పెట్టుకుందని అనుకుంటారు. కానీ మీరు అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఆమె కన్నీళ్లు పెట్టుకోవడానికి ప్రధాన కారకులు మెగా కుటుంబమే అని తెలుస్తోంది. అయితే పెళ్లికి ముందు ఉపాసన చాలా చబ్బీగా ఉండేదట. ఆమెను చూసిన కొంత మంది దారుణంగా కామెంట్ చేశారట. కానీ ఉపాసన వాటన్నింటిని పట్టించుకోకుండా చాలా స్ట్రాంగ్ గా ముందుకు వెళ్లిందట.. అయితే ఆమెను కామెంట్ చేసింది తన దగ్గరివాల్లో తన కుటుంబీకులో కాదు. తనంటే పడని వాళ్ళు అలాంటి కామెంట్లు చేశారు. అందుకే ఆమె ఆ కామెంట్స్ ను తన హార్ట్ వరకు తీసుకోకుండా ఇలా విని అలా వదిలేసేదట.
అలాంటి ఉపాసన మెగా ఫ్యామిలీలో అడుగుపెట్టిన తర్వాత రామ్ చరణ్ తో పాటు చిరంజీవి సురేఖ కూడా ఎంతో సపోర్టుగా నిలిచారట. ఎలాంటి కామెంట్స్ వచ్చినా పట్టించుకోవద్దమ్మా అంటూ సపోర్టుగా ఉన్నారట. కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళ అత్త మామ ప్రేమ చూసి ఉపాసన కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయట. అయితే ఈ విషయాన్ని ఆమె ఒకానొక సమయంలో బయట పెట్టడంతో అవి కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో మెగా అభిమానులు మా అన్నయ్య చిరంజీవి మా వదినమ్మ సురేఖ అంటే అంతే.. వారు వాళ్ళ కోసం కాకుండా ఇతరుల కోసమే అనేకం చేసి త్యాగం చేస్తూ వచ్చారు. సొంత కూడలివి నిన్ను అంతకంటే ఎక్కువ చూసుకోవడంలో తప్పులేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Upasana)