Sai Pallavi called that hero as brother

Sai Pallavi: లేడీ పవర్ స్టార్ నాచురల్ స్టార్ గా సౌత్ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న బ్యూటీ అనగానే అందరికీ సాయి పల్లవి పేరే గుర్తుకొస్తుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం శివ కార్తికేయన్ తో కలిసి అమరన్ అనే మూవీలో నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 31 దీపావళి కానుకగా వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది.ఈ సినిమా ఓ బయోపిక్..మేజర్ ముకుంద వరదరాజన్ జీవిత కథ ఆధారం చేసుకొని అమరన్ అనే మూవీ ని తెరకెక్కిస్తున్నారు.

Sai Pallavi called that hero as brother

ఇక ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పోస్టర్,గ్లింప్స్,టీజర్ అన్ని ప్రేక్షకులను భారీగా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా చెన్నైలో ఈ సినిమాకి సంబంధించి ఆడియో లాంచ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా జరిపించారు చిత్ర యూనిట్. ఈ ఈవెంట్ కి మణిరత్నం, లోకేష్ కనగరాజ్ లు చీఫ్ గెస్ట్లుగా వచ్చారు. అయితే ఈ ఈవెంట్లో శివ కార్తికేయన్ సాయి పల్లవి గురించి ఒక సంచలన విషయం బయట పెట్టారు. (Sai Pallavi)

Also Read: Samantha: వద్దన్నా వినకుండా సమంత ను ఆ సీన్స్ లో నటించేలా దర్శకుడు!!

శివ కార్తికేయన్ స్టేజిపై మాట్లాడుతూ.. సాయి పల్లవి తో ఎప్పటికైనా సినిమా చేస్తాను అని ఆమె ప్రేమమ్ సినిమాలో నటించే సమయంలోనే నేను చెప్పాను.అది ఇప్పటికి కుదిరింది.. ఇక ప్రేమమ్ మూవీలో సాయి పల్లవి నటనకి నేను చాలా ఫిదా అయిపోయాను.ఆ సినిమాలో మలర్ అనే టీచర్ పాత్రలో సాయి పల్లవి అదరగొట్టేసింది. ఇక ఈ పాత్రకి నేను ఫిదా అయి స్వయంగా సాయి పల్లకి ఫోన్ చేసి మరీ విష్ చేశాను..

Sai Pallavi called that hero as brother

మీరు మలర్ పాత్రలో అదరగొట్టేసారు అని నేను చెప్పడంతోనే సాయి పల్లవి థాంక్యూ అన్నా అని మాట్లాడింది.ఇక సాయి పల్లవి అన్నా అని మాట్లాడినందుకు నేను చాలా హర్ట్ అయ్యాను అంటూ శివ కార్తికేయన్ నవ్వుకుంటూ ఆరోజు జరిగిన విషయాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం శివ కార్తికేయన్ మాటలు విన్న నెటిజన్స్ ఎన్నో ఆశలతో ఫోన్ చేస్తే సాయి పల్లవి అన్నా అన్నందుకు ఎంతగా ఫీల్ అయ్యారో అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Sai Pallavi)