Hansika gave good news for two years of marriage

Hansika: పంజాబీ బ్యూటీ హన్సిక మోత్వాని పెళ్లయిన ఇన్ని రోజులకు గుడ్ న్యూస్ చెప్పిందా? ఇంతకీ హన్సిక చెప్పినా ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. సౌత్ సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన హన్సిక మోత్వాని తన చబ్బి చీక్స్ తో ఎంతో మందిని ఆకర్షించింది. అయితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎంతో లావుగా ఉన్న ఈ బొద్దుగుమ్మ ప్రస్తుతం ముద్దుగుమ్మగా మారిపోయింది.ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో హన్సిక ఎలా ఉందో ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా ఉంది.

Hansika gave good news for two years of marriage

అప్పట్లో ఆమెను చూసిన నెటజన్స్ ఇప్పుడు ఆమెను చూసి షాక్ అయిపోతున్నారు. ఏంటి హన్సిక ఇంత సన్నబడింది అని. ఇక హన్సిక సినీ కెరీర్ బాగున్నప్పటికీ పర్సనల్ కెరియర్ లో మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. నటుడు శింబుతో ప్రేమలో పడి ఎన్నో ఇబ్బందులు పడినట్టు వార్తలు వినిపించాయి. అయితే వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లినప్పటికీ అది జరగలేదు.(Hansika)

Also Read: Upasana: పెళ్ళైన కొత్తలో సురేఖ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న ఉపాసన.. అంత టార్చరా.?

ఇక మరో విచిత్రం ఏమిటంటే హన్సిక మోత్వాని తన ఫ్రెండ్ భర్తని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తన ఫ్రెండ్ పెళ్లిలో హన్సిక సందడి చేసిన వీడియోలు ఇప్పటి కూడా నెట్టింట్లో చక్కర్లు కొడతాయి.ఆ తర్వాత వారి విడాకులు జరగడంతో హన్సిక ఆయనకి కనెక్ట్ అయి వీరిద్దరి పెళ్లి జరిగింది. అయితే పెళ్లి అయినా రెండేళ్లకు గుడ్ న్యూస్ చెప్పింది అంటే అందరూ హన్సిక ప్రెగ్నెంట్ కావచ్చు అనుకుంటారు.కానీ అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే.

Hansika gave good news for two years of marriage

ఎందుకంటే హన్సిక ప్రెగ్నెంట్ కాదు రీసెంట్ గానే హన్సిక ఒక కొత్త బంగ్లా కట్టుకుంది.అన్ని రకాసౌకర్యాలతో ఎంతో అందంగా హన్సిక స్వయంగా కట్టుకున్న బంగ్లాలోకి రీసెంట్ గానే భర్తతో కలిసి గృహప్రవేశం చేసింది.ఇక హన్సిక సోహెల్ కతూరియా ఇద్దరు కలిసి కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసిన ఫోటోలు అభిమానులతో పంచుకుంది.ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి.(Hansika)