ANR: తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం ఈ స్థాయిలో ఉందంటే ఆ నలుగురు హీరోలే ప్రధాన కారకులని చెప్పవచ్చు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సీనియర్ ఎన్టీఆర్ అయితే మరో వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు, ఇంకో వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ, ఆ తర్వాత స్థానాల్లో కృష్ణంరాజు, శోభన్ బాబులు ఉంటారు. వీరి వల్లే టాలీవుడ్ బలపడిందని చెప్పవచ్చు.. అలాంటి వారిలో మంచి గుర్తింపు సాధించి దూసుకుపోయిన హీరో అక్కినేని నాగేశ్వరరావు.. ఈయన అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడు గా ఉండేవారు. ఆయన ఎంతో మంది హీరోయిన్లతో నటించి మెప్పించారు.
ANR was caught with a girl in the theatre
సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అంటే రూమర్స్ రావడం కామన్. ఆ విధంగానే అక్కినేని నాగేశ్వరరావు పై వచ్చినటువంటి ఒక చిన్న రూమర్ వల్ల తన భార్యతో విపరీతమైనటువంటి గొడవ ఏర్పడిందట. చివరికి ఆయనతో కలిసి ఒక్కసారి కూడా ఆమె థియేటర్లలో సినిమా చూడలేదట. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. నాగేశ్వరరావు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కాస్త గుర్తింపు పొందిన తర్వాత అన్నపూర్ణాని పెళ్లి చేసుకున్నారు. అయితే ఓ రోజు అన్నపూర్ణతో సినిమా చూడటానికి చెన్నైలోని ఒక థియేటర్ కి వెళ్లారట.(ANR)
Also Read: Kareena Kapoor: సైఫ్ అలీ ఖాన్ – కరీనా కపూర్ విడాకులు.. బాలీవుడ్ లో హల్చల్!!
అయితే అప్పుడే ఎదుగుతున్న హీరో కాబట్టి కొంతమంది ఆయనను గుర్తించి గౌరవం ఇచ్చి కుర్చీలో కూర్చోబెట్టారట. అయితే నాగేశ్వరరావుకు పెళ్లి అయిన విషయం ఎవరికీ తెలియదు. ఆయన పక్కన ఉన్నది తన భార్య అన్నపూర్ణ అయినా కానీ, ఆ థియేటర్లలో కూర్చున్న వారు తమిళ్లో మాట్లాడుతూ ఆయన పక్కన కూర్చున్నది భానుమతా.. లేక వరలక్ష్మినా.. లేదా అంజలినా అనుకుంటూ రకరకాల పేర్లతో గుసగుసలు పెట్టుకుంటున్నారట. ఈ విషయాన్ని తమిళ్ అర్ధమైనటువంటి నాగేశ్వరరావు తన భార్యకు చెబుతూ వస్తున్నారట.
దీంతో హర్ట్ అయిపోయినటు వంటి అన్నపూర్ణ ఇంటికి వచ్చిన తర్వాత ఏఎన్ఆర్ కు కండిషన్ పెట్టిందట. నేను ఇప్పటి నుంచి మీతో ఎక్కడికి సినిమాకు రాను అని అప్పటినుంచి బయటకు కూడా సినిమాకు వెళ్లలేదట. కేవలం హైదరాబాదులో వారి సొంత అన్నపూర్ణ థియేటర్లో మాత్రమే ఆమె సినిమా చూసి వచ్చేదట. అలా కొంతమంది చేసినటువంటి రూమర్ల వల్ల తన ఫ్యామిలీ ఎంతో డిస్టర్బ్ అయిందని, క్రియేట్ చేసి రాసేవారు కాస్త ఆలోచన చేయాలని, మాక్కూడా ఫ్యామిలీలు ఉంటాయని ఓ ఇంటర్వ్యూలో ఏఎన్ఆర్ బయటపెట్టారట.(ANR)