How Ravi Teja Missed Out on the Blockbuster Mirchi

Ravi Teja: సినిమా రంగంలో ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరోకి వెళ్లి, అది భారీ విజయాన్ని సాధించడం కొన్నిసార్లు చూడాల్సి వస్తుంది. టాలీవుడ్‌లో ఇలాంటి సంఘటన మాస్ మహారాజ్ రవితేజకు జరిగింది. ఆయన వదులుకున్న “మిర్చి” సినిమా యువ రెబల్ స్టార్ ప్రభాస్‌కి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

How Ravi Teja Missed Out on the Blockbuster Mirchi

2013లో విడుదలైన “మిర్చి” సినిమా ప్రభాస్ కెరీర్‌లో ఒక కీలక మలుపుగా నిలిచింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన అనుష్క శెట్టి, రీచా గంగోపాధ్యాయ నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మొదట ఈ కథను రవితేజకు వినిపించడం.

Also Read: Pawan Kalyan: దీపికా పదుకొనే పవన్ కాంబోలో మిస్ అయిన మూవీ..?

కొరటాల శివ, రవితేజకి మంచి స్నేహితుడు. “భద్ర” సినిమాకు మాటలు రాసిన శివ, తన కథను ముందుగా రవితేజకు చెప్పాలని నిర్ణయించుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల రవితేజ ఈ కథను రిజెక్ట్ చేశారు. దాంతో కొరటాల శివ ప్రభాస్‌ వద్దకు వెళ్లారు. ప్రభాస్‌కు కథ బాగా నచ్చడంతో వెంటనే సినిమాకు అంగీకరించారు. అయితే అప్పటికే ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో “బాహుబలి” సినిమాకు కమిట్‌ అయ్యారు.

అయినప్పటికీ, ప్రభాస్ “బాహుబలి” షూటింగ్ నుంచి కొంత విరామం తీసుకుని “మిర్చి”ను పూర్తి చేశారు. ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో మరో పెద్ద విజయాన్ని నమోదు చేసింది. అయితే రవితేజ మాత్రం “మిర్చి” లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకున్నారు.