Venkatesh: సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఒక్కటే కాకుండా, పరిచయాలు కూడా చాలా ముఖ్యమని పెద్దలు చెప్పడం వాస్తవం. ఎందుకంటే, ఎప్పుడు, ఎవరి ద్వారా అవకాశం వస్తుందో మనకు తెలియదు. అలాంటి సమయంలో మంచి పరిచయాలు ఉంటే సినిమాల్లోకి అడుగుపెట్టడం సులభం అవుతుంది. అంతేకాకుండా, పెద్ద అవకాశాలు కూడా వస్తాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే స్టార్‌డమ్ దక్కించుకోవడం పెద్ద సవాలు కాదు. ఈ విషయం ఏ క్రాఫ్ట్‌కి అయినా వర్తిస్తుంది.
Trivikram Plans Another Collaboration with Venkatesh
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్ ప్రారంభంలో పోసాని కృష్ణమురళి దగ్గర అసిస్టెంట్ రైటర్‌గా పని చేశారు. ఆ సమయంలో ‘పవిత్ర బంధం’ సినిమా కోసం పోసాని వద్ద పనిచేస్తున్నప్పుడు వెంకటేష్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాల విలువ త్రివిక్రమ్‌కి అప్పుడు బాగా అర్థమైంది. వెంకటేష్‌తో స్నేహం పెంచుకోవడంతో ఆయనకు మంచి అవకాశాలు లభించాయి.
Also Read: Chiranjeevi: చిరంజీవి తో సినిమా ఎందుకు చేయలేదు.. ఎస్వీ కృష్ణారెడ్డి ఆసక్తికర సమాధానం!!
త్రివిక్రమ్, స్టార్ రైటర్‌గా ఎదిగిన తర్వాత, వెంకటేష్‌తో ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా చేసే అవకాశం వచ్చింది. అప్పటి పరిచయం ఎంతో ఉపయోగపడింది. సినీ ప్రముఖులలో చాలా మంది, ఇండస్ట్రీలో ఉన్న పరిచయాలే మన విజయానికి నాంది అవుతాయని చెబుతుంటారు. త్రివిక్రమ్-వెంకటేష్ మధ్య ఉన్న స్నేహం వల్ల ‘నువ్వు నాకు నచ్చావ్,’ ‘మల్లీశ్వరి’ వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.
ఇప్పుడు మళ్ళీ త్రివిక్రమ్, వెంకటేష్‌తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సరైన కథ దొరికితే, ఈ ఇద్దరి కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను అలరించే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.ఐటిహీ దర్శకుడు అయ్యాక వెంకటేష్ తో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయకపోవడం తో వెంకీ అభిమానులు త్రివిక్రమ్ పై కొంత గుర్రుగా ఉన్నారు.