Roja Criticizes Chandrababu Naidu for Attending Reality Show

Chandrababu Naidu: మాజీ మంత్రి రోజా, బాలకృష్ణ నిర్వహిస్తున్న “అన్ స్టాపబుల్” షోకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరైన ఘటనపై తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు పెరుగుతున్న సమయంలో ఇలాంటి రియాలిటీ షోలకి సీఎం హాజరుకావడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా, రాష్ట్రంలో మహిళల భద్రత లేకుండా ఉంటే, చంద్రబాబు మాత్రం హైదరాబాద్‌లో సేదతీరుతున్నారంటూ రోజా విమర్శలు గుప్పించారు.

Roja Criticizes Chandrababu Naidu for Attending Reality Show

రోజా శుక్రవారం నాడు చంద్రబాబు కుటుంబంపై కూడా చురకలు అంటించారు. వారంతా ప్రతి వారాంతంలో హైదరాబాద్‌కి వెళ్లి ఆడవాళ్ల భద్రత గురించి పట్టించుకోకుండా ఎంజాయ్ చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా, రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోతున్న సమయంలో చంద్రబాబు ఇలాంటి షోలకి హాజరుకావడం మానవత్వానికి విరుద్ధమని పేర్కొన్నారు.

Also Read: Chandrababu Naidu: చంద్రబాబు కు తలనొప్పిగా మరీనా ‘రెడ్డి’ నాయకులు..వారిపై యాక్షన్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు గజగజ వణుకుతూ బయటకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందని, దీనికి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోమ్ మంత్రి అనితలు బాధ్యత వహించాలని రోజా డిమాండ్ చేశారు. బాలయ్య నిర్వహిస్తున్న రియాలిటీ షోకు చంద్రబాబు ఎందుకు హాజరయ్యారు? అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో ప్రజలు కష్టాలు పడుతుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు రియాలిటీ షోలలో పాల్గొంటూ ముఖానికి పౌడర్ రాసుకోవడం సరికాదని, అసమర్థమై నాయకత్వం కారణంగా ఆంధ్రప్రదేశ్ ఇంత దారుణమైన స్థితిలోకి వచ్చిందని రోజా విమర్శించారు.