Revanth reddy: పదేళ్ల క్రితం అధికారాన్ని కోల్పోయి, లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటును కూడా సాధించలేకపోయిన ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఇప్పుడు తీవ్రమైన రాజకీయ కష్టాలను ఎదుర్కొంటోంది. పార్టీలోని నాయకులు జారిపోతుండటమే కాక, గ్రూపు రాజకీయాలను అదుపు చేయడంలో విఫలమవడంతో పార్టీ మరింత సంక్షోభంలో పడింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు గెలుచుకున్నప్పటికీ, ఆ వెంటనే జరిగిన లోక్సభ ఎన్నికల్లో ప్రభావం చూపడంలో బీఆర్ఎస్ విఫలమైంది.
Prashant Kini Predicts Bright Future for KCR Revanth reddy
అసెంబ్లీ ఎన్నికల తర్వాత, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాత్రూంలో జారి పడటంతో ఆయన తుంటి ఎముక విరిగి, 3 నెలలకుపైగా విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. దీంతో పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశలో కూరుకుపోయాయి. ఈలోగా 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడం, పార్టీ పరిస్థితిని మరింత దిగజారించింది.
Also Read: Chandrababu Naidu: బాలయ్య షో కి వెళ్లిన చంద్రబాబు.. సిగ్గుందా అంటూ మాజీ మంత్రి రోజా!!
ఈ రాజకీయ కష్టాల నేపథ్యంలో, ప్రముఖ జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని, కేసీఆర్ త్వరలో మహర్దశ పట్టనుందని, ఆయనకు శుభకాళాలు ప్రారంభం కానున్నాయని జోస్యం చెప్పారు. రాహు కాలం ప్రస్తుతం కొనసాగుతున్నప్పటికీ, త్వరలోనే కేసీఆర్కు కాలం కలిసి రావడమే కాక, రాజయోగం కలగనుందని విశ్లేషించారు.
ప్రశాంత్ ఈ విషయాలను తన ఎక్స్ అకౌంట్లో పంచుకున్నారు, అక్కడ ఈ జోస్యం తెగ వైరల్ అయింది. కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారంటూ బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో ఉత్సాహంగా పోస్ట్ చేస్తున్నారు.