Vijay Sethupathi: నటుడు విజయ్ సేతుపతి అంటే ప్రత్యేక పరిచయాలు అక్కర్లేని పేరు. ఈయనని కేవలం సౌత్ వాళ్లే కాదు నార్త్ వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే కేవలం హీరో లక్షణాలు మాత్రమే కాదు విలన్ లక్షణాలు కూడా ఉన్నాయి. అందుకే ఓవైపు హీరోగా చేస్తూనే మరోవైపు విలన్ గా అదర గొట్టేస్తున్నారు. అయితే అలాంటి విజయ్ సేతుపతి ఇండస్ట్రీకి యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రస్తుతం హీరోగా.. విలన్ గా.. మారిపోయారు.
Vijay Sethupathi second marriage with that heroine
ఇక విజయ్ సేతుపతి ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించారు. సినిమాల ద్వారా వచ్చిన గుర్తింపుతో ఈయన పేరు ఎక్కడికో వెళ్లిపోయింది. అయితే అలాంటి విజయ్ సేతుపతి గురించి గత కొద్ది రోజులుగా తమిళ మీడియాలో ఒక ప్రచారం జరుగుతుంది. అదేంటంటే విజయ్ తనతో నటించిన ఓ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని, పెళ్లైన విషయం కూడా పక్కనపెట్టి ఆ హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నారంటూ ఎన్నో ఊహగానాలు వినిపిస్తున్నాయి.(Vijay Sethupathi)
Also Read: Balakrishna: బాలకృష్ణ ‘NBK109’ పై ఫ్యాన్స్ అంచనాలు.. సంక్రాంతికే రావాలని పట్టు!!
ఇక ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే..టాలీవుడ్ దివంగత నటుడు రాజేష్ కూతురు ఐశ్వర్య రాజేష్.. సౌత్ లో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్ కలర్ తక్కువైనా కూడా తన పాత్రలో తాను లీనమై నటించడంతో ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఫేమస్ అయిపోయింది.అయితే అలాంటి ఐశ్వర్యతో విజయ సేతుపతి డేటింగ్ చేస్తున్నారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.
దానికి ప్రధాన కారణం వీరి కాంబోలో ఎక్కువ సినిమాలు రావడమే. ఇక వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి రిజల్ట్ తెచ్చుకున్నాయి.అందుకే ఈ జంట మద్య ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కానీ ఈ ఎఫైర్ వార్తలపై ఐశ్వర్య రాజేష్ విజయ్ సేతుపతి స్పందించకపోవడం చాలా మందిలో అనుమానాలు రేకెత్తించింది.(Vijay Sethupathi)