ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న “అన్‌స్టాపబుల్” టాక్ షో నాలుగో సీజన్‌లో తొలి ఎపిసోడ్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అతిథిగా విచ్చేశారు. ఈ ఎపిసోడ్‌కు నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ ఎపిసోడ్‌లో బాలకృష్ణ, చంద్రబాబును అనేక కాంట్రవర్సీ ప్రశ్నలు అడిగారని తెలుస్తోంది.

“జైలు జీవితం చంద్రబాబులో సీమ పౌరుషాన్ని నిద్రలేపిందా?”, “వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా కటకటాల పాలు చేసి కక్ష తీర్చుకోవాలన్న కోరిక కలిగిందా?”, “మాజీ సీఎంకు వ్యతిరేకంగా చంద్రబాబు సిద్ధం చేసిన ఫైల్స్ ఏంటి?” వంటి ప్రశ్నలతో చంద్రబాబును బాలకృష్ణ ఇరుకున పెట్టారట. “జైలు జీవితం చంద్రబాబులో మరో మనిషిని నిద్రలేపిందా?”, “జగన్ ఇక తీవ్ర పర్యవసానాలు చూడబోతున్నారా?” అంటూ బాలకృష్ణ సూటిగా ప్రశ్నించారట. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు చెప్పేది ఏమిటని కూడా బాలకృష్ణ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

“53 రోజులు చంద్రబాబు జైల్లో ఎలా గడిపారు?”, “సీఎంగా జైళ్లను ఆధునీకరించిన చంద్రబాబు, ఓ నిందితుడిగా ఆ గదుల్లోనే గడపాల్సి రావడంతో ఎలా ఫీలయ్యారు?”, “రాజమండ్రి జైల్లో VIPగా గడిపారా? భయంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారా?” వంటి ప్రశ్నలతో చంద్రబాబు జైలు జీవితం గురించి బాలకృష్ణ తెలుసుకోవాలనుకున్నారట. “రాజమండ్రి సెంట్రల్ జైలు గోడల మధ్య నుంచి చంద్రబాబు చూసిన ప్రపంచం ఎలా ఉంది?”, “చదివిన పత్రికలేంటి?”, “చూసిన టీవీలేంటి?”, “కొత్తగా అలవర్చుకున్న అలవాట్లేంటి?” అంటూ ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగారట.

“టీడీపీ-జనసేన మధ్య పొత్తును పవన్ కళ్యాణ్ ప్రకటించడానికి కొద్ది నిమిషాల ముందు రాజమండ్రిలోని సెంట్రల్ జైలు నాలుగు గోడల మధ్య జరిగిన మంత్రాంగం ఏంటి?”, “ఇద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చ తర్వాత వచ్చిన ప్రకటనా? పవన్ ఎమోషన్‌లో తీసుకున్న నిర్ణయమా?” అంటూ పొత్తుల గురించి కూడా బాలకృష్ణ ప్రశ్నించారట. “లోకేష్, పవన్ కళ్యాణ్, బాలయ్య ముగ్గురిలో చంద్రబాబుకు అత్యంత ఇష్టమైన వ్యక్తి ఎవరు?” అని అడిగి చంద్రబాబును ఇరకున పెట్టారట. “భవిష్యత్తులో టీడీపీని సమర్థవంతంగా నడపగల శక్తి లోకేష్‌లో ఉందంటారా?”, “జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు ఏం చెప్పారు?” అనే ప్రశ్నలు కూడా ఈ ఎపిసోడ్‌లో ఉంటాయట.

చంద్రబాబు ఈ ప్రశ్నలన్నింటికీ ఎలా సమాధానమిచ్చారో తెలియాలంటే ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే.లోకేష్‌, పవన్‌కల్యాణ్‌, బాలయ్య ముగ్గురిలో చంద్రబాబుకు అత్యంత ఇష్టమైన వ్యక్తి ఎవరు? అని అడిగారట. అడ్మినిస్ట్రేషన్, కుటుంబవ్యవహరాల్లో సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రహ్మణిలకు చంద్రబాబు ఇస్తున్న మార్కులెన్ని అంటూ చంద్రబాబుని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారట. – భవిష్యత్తులో టీడీపీని సమర్థవంతగా నడపగల శక్తి లోకేష్ ఉందంటారా? జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు ఏం చెప్పారన్నది కూడా ఎపిసోడ్‌లో ఉంటుందట.

గ్రౌండ్ లెవెల్లో జనసేన, టీడీపీ మధ్య సమన్వయ లోపం ఉందా? ప్రోటోకాల్ విషయంలో టీడీపీ నాయకులు జనసేనను తక్కువగా చూస్తున్నారా? అని అందరిలోనూ ఉన్న అనుమానాల్ని అడిగేశారట. అమరావతి అందరికి రాజధానా? లేదా సంపన్నులకు మాత్రమే రాజధానిగా మారనుందా?అని కూడా నేరుగా అడిగేశారట. ఇక ఇలాంటి చిక్కు ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు ఎలాంటి సమాధానాలు చెప్పారో తెలియాలంటే ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే.