Jeevan Reddy: కాంగ్రెస్ పార్టీకి ఓ దండం రా బాబు అంటూ… ఆ పార్టీ… సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా జగిత్యాలలో… కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డిని… అత్యంత దారుణంగా… కుట్రపల్లి చ**పేశారు. మంగళవారం ఉదయం పూట కారులో.. వచ్చి మరి ఎటాక్ చేశారు. దీంతో గంగారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. Jeevan Reddy
Jeevan Reddy Comments On Congress Party
అయితే ఈ సంఘటనపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రోడ్డుపైన బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ తమ అనుచరులను కాపాడుకోలేకపోయామని ఆయన మండిపడ్డారు. గులాబీ పార్టీ నుంచి గెలిచిన సంజయ్ కుమార్ అనుచరుడు సంతోష్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు… వెల్లడించారు జీవన్ రెడ్డి. ఆ పార్టీ నుంచి తీసుకోవడం వల్ల… అసలు సిసలు కాంగ్రెస్ నాయకులకు న్యాయం జరగడం లేదని ఆయన మండిపడ్డారు. రాహుల్ గాంధీ అలాగే రాజీవ్ గాంధీ మాట వినాలి కానీ… కెసిఆర్ చేసినట్లుగా మనం చేయకూడదని రేవంత్ రెడ్డికి చురకాల అంటించారు. Jeevan Reddy
Also Read: Rohit Sharma: న్యూజిలాండ్ చేతిలో ఓటమి..రోహిత్ కు భారీ శిక్ష ?
అయితే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కూల్ చేద్దామని కాంగ్రెస్ అధిష్టానం… కొంతమంది ఎమ్మెల్యేలను అక్కడికి పంపిస్తే.. ఆయన ముఖం మీద చీదరగొట్టారు. మీ పార్టీ వద్దు మీరు వద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. ఓ ప్రైవేట్ కంపెనీ పెట్టుకొని తాను నడిపించుకుంటానని వెల్లడించారు జీవన్ రెడ్డి. దీంతో కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. Jeevan Reddy