Divorce Rumors: సినీ పరిశ్రమలో ప్రేమ వివాహాలు సాధారణంగా జరుగుతున్నాయి. కొంతకాలంగా ప్రేమలో ఉన్నవారు పెళ్లి చేసుకుంటే, అందులో కొన్ని సాఫీగా కొనసాగుతాయి, మరికొన్ని మాత్రం వివాహ బంధం సుఖదాయకంగా ఉండకపోతే అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. మరికొన్ని వివాహాలు చాలా సంవత్సరాల తర్వాత కూడా వివిధ కారణాలతో విచ్ఛిన్నమవుతున్నాయి. తాజాగా, తెలుగు సినీ పరిశ్రమలో ప్రాముఖ్యత కలిగిన రమ్యకృష్ణ, ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ వివాహ బంధం కూడా ముగింపు దశకు చేరుకుంటుందన్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
Krishna Vamsi Responds to Divorce Rumors with Ramya Krishnan
1990లలో స్టార్ హీరోయిన్గా పేరుతెచ్చుకున్న రమ్యకృష్ణ, తన అందం మరియు అద్భుతమైన నటనతో తెలుగు, తమిళ ప్రేక్షకులను మెప్పించింది. 2003లో కృష్ణవంశీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే, ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్య విభేదాలు పెరుగుతున్నాయని, వారు దూరంగా ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.
Also Read: Chandrababu: చంద్రబాబులో కొత్త యాంగిల్.. ఆశ్చర్యపోతున్న ప్రజలు!!
ఈ వార్తలపై కృష్ణవంశీ స్పందిస్తూ, “నేను ఓ సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్‌లో ఉండాల్సి వస్తోంది, రమ్యకృష్ణ చెన్నైలో ఉంది కాబట్టి, మేము వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నాం” అని తెలిపారు. తమ గురించి దుష్ప్రచారం జరుగుతున్నదని, ఇలాంటి ప్రచారాలు చాలా బాధాకరమని కృష్ణవంశీ వ్యాఖ్యానించాడు. “ఒకరి కుటుంబం గురించి ఇష్టానుసారంగా మాట్లాడటం శాడిస్ట్ తనం” అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, రమ్యకృష్ణ ఈ వార్తలపై ఇప్పటివరకు స్పందించలేదు.
ఇప్పటికీ 40 ఏళ్ల వయసులోనూ రమ్యకృష్ణ తన సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఆమె విభిన్న పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. రమ్యకృష్ణ ఇప్పటికే 200కు పైగా సినిమాల్లో నటించి, తన అందం మరియు అభినయాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ సమయంలో, ఆమె కేవలం హీరోయిన్గా మాత్రమే కాకుండా, లేడీ విలన్‌గా కూడా అద్భుతమైన పాత్రలు పోషించింది. రమ్యకృష్ణ మరియు కృష్ణవంశీ వివాహ బంధం గురించి త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.