Nithya Menen: ఏంటి మలయాళీ ముద్దుగుమ్మ నిత్యమీనన్ పెళ్లికి రెడీ అయిపోయిందా..నిజంగానే ఆ కోలీవుడ్ నటుడితో నిత్యమీనన్ పెళ్లి జరగబోతుందా? ఇంతకీ నిత్యమీనన్ పెళ్లి వార్తల్లో ఉన్నది ఎంత నిజం అనేది ఇప్పుడు చూద్దాం.. 40 ఏళ్లకు దగ్గర పడుతున్న హీరోయిన్లకు పెళ్లి మీద ధ్యాసే లేదు. కొంతమంది హీరోయిన్ లేమో 25 దాటడంతోనే పెళ్లిళ్లు చేసుకుంటారు.
The hero who is going to marry Nithya Menen
కానీ మరి కొంతమంది హీరోయిన్ లేమో 40 ఏళ్లు దాటినా కూడా పెళ్లికి సంబంధించిన ఏ విషయాన్ని కూడా ఆలోచించరు.అలా మన సౌత్ ఇండస్ట్రీలో ఇప్పటికే 40 ఏళ్ల వయసున్న పెళ్లి కానీ భామలు ఎంతోమంది ఉన్నారు.. అయితే తాజాగా నిత్యామీనన్ పెళ్లి వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రీసెంట్ గానే70 వ చలన చిత్ర అవార్డ్స్ లో బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డు అందుకున్న నిత్యమీనన్ పై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. (Nithya Menen)
Also Read: HBD Prabhas: ప్రభాస్ కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ.?
అయితే నిత్యామీనన్ కి తిరు మూవీలోని నటనకి గాను ఈ అవార్డు వరించింది.ఇదిలా ఉంటే నిత్యామీనన్ గురించి తాజాగా పెళ్లి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.అయితే కోలీవుడ్ లో ఉండే నటుడితో గత కొద్ది రోజులుగా నిత్య మీనన్ సన్నిహితంగా ఉంటుంది అని వీరిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
అయితే ఇప్పటికే నిత్యమీనన్ పేరు నితిన్,ధనుష్, దుల్కర్ సల్మాన్,కిచ్చా సుదీప్ వంటి ఎంతో మంది హీరోలతో వినిపించింది.కానీ ఎవరితో కూడా పెళ్లి వరకు వెళ్లలేదు. మరి తాజాగా కోలీవుడ్ లో వినిపిస్తున్న నిత్యమీనన్ పెళ్లి వార్తలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి.ఇక నిత్యామీనన్ ప్రస్తుతం ఇడ్లీ కడై మూవీలో చేస్తుంది.(Nithya Menen)