Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ 45 వ పుట్టినరోజు ని గ్రాండ్ గా చేసుకుంటున్నారు.ఈయన బర్త్‌డేని దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈయనకున్న అభిమానులు అందరూ భారీ కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు చేస్తూ అన్నదానాలు, రక్తదానాలు చేస్తూ ఎంతో హడావిడి చేసేస్తున్నారు. ఇక ప్రభాస్ బర్త్‌డే అంటే మినిమం ఉండాల్సిందే కదా..
If you know what Prabhas does on every birthday
మరి అలాంటి ప్రభాస్ తన ప్రతి బర్త్‌డేకి చేసే పని ఏంటో తెలిస్తే మీరందరూ కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే.మరి ఇంతకీ ప్రభాస్ ప్రతి ఏటా తన బర్త్‌డేని ఎలా జరుపుకుంటారో ఇప్పుడు చూద్దాం. చాలా మంది హీరోలు పెళ్లయ్యాక బర్త్ డే వస్తే తమ ఫ్యామిలీతో వెకేషన్ లకి వెళ్తూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.అయితే ప్రభాస్ కి ఇప్పటివరకు పెళ్లి కాలేదు కాబట్టి తన ఇంట్లోనే అమ్మ, పెద్దమ్మ చెల్లెళ్లతో చాలా సరదాగా గడుపుతారట.(Prabhas)
Also Read: NTR: ఎన్టీఆర్ ఇమేజ్ డౌన్ చేస్తున్న యాంటీ ఫ్యాన్స్.. సరైన బుద్ధి చెప్పిన ఎన్టీఆర్ ఫ్యాన్స్!!
ఇక ఈరోజు తనకి ఇష్టమైన వంటలన్నీ ప్రేమగా వండించుకొని తింటారట. అంతేకాదు ప్రభాస్ బర్త్‌డే రోజు ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి గుడికి వెళ్లి అన్నదానం చేస్తుందట. ఇక ప్రభాస్ అయితే అనాధశ్రమాలకు వెళ్లి విరాళాలు ఇస్తూ ఉంటారట. ఇక ప్రతి బర్త్‌డేకి ప్రభాస్ ఓ 100 మంది ఆనాధలను ఫ్రీగా వారి చదువులు అయిపోయే వరకు చదివిపిస్తారట.
అలా తన బర్త్‌డే రోజు ప్రభాస్ ఎన్నో మంచి పనులు చేస్తారట. ఇక ప్రభాస్ తన బర్త్‌డేకి చేసే ఈ పనులు చూసి చాలామంది శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు.అంతేకాదు మిగతా హీరోలు కూడా ప్రభాస్ ని చూసి వెకేషన్స్, ట్రిప్పులు అంటూ డబ్బులు వృధా ఖర్చు చేయకుండా ఇలా పేదవారికి,అనాధలకు ఇస్తే బాగుంటుంది అని కామెంట్లు పెడుతున్నారు.(Prabhas)