Pushpa 2 Outpaces RRR in Pre-release Buzz and Business

Pushpa 2: “పుష్ప: ది రైజ్” సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించిన అల్లు అర్జున్, ఇప్పుడు “పుష్ప 2: ది రూల్” తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, ఆడియన్స్‌ ఆశగా ఎదురు చూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలవుతోంది. ఈ సినిమాపై మేకర్స్ 1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధిస్తుందని ధీమాగా ఉన్నారు. ఈ భారీ అంచనాల నడుమ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా జరుగుతున్నాయి.

Pushpa 2 Outpaces RRR in Pre-release Buzz and Business

మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో కూడా “పుష్ప 2” అత్యంత ప్రభావవంతంగా నిలిచింది. మేకర్స్ ప్రకారం, “ఆర్ఆర్ఆర్” సినిమాతో టాలీవుడ్‌లో పెద్దగా చర్చనీయాంశమైన ప్రీ రిలీజ్ బిజినెస్‌ను “పుష్ప 2” అధిగమించిందట. ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల కలయికతో వచ్చిన “ఆర్ఆర్ఆర్” సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్‌ను “పుష్ప 2” దాటిందని చెప్పడంతో సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ అయ్యింది. కొందరు ఈ వార్తలను ఆశ్చర్యంగా చూడగా, మరికొందరు “ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల కంటే అల్లు అర్జున్ అంతటి స్టార్డమ్ సంపాదించాడా?” అంటూ చర్చిస్తున్నారు.

Also Read: RCB: ఆర్సిబికి షాక్… ఆ ప్లేయర్లు వద్దంటున్న కర్ణాటక సర్కార్ ?

అయితే, ఈ వార్తలను నమ్మని వారు కూడా ఉన్నారు. అల్లు అర్జున్ అతిగా ప్రచారం చేసుకుంటాడని, ఆయనకు సంబంధించిన ఈ వార్తలు అబద్ధాలని కూడా వారు అంటున్నారు. ముఖ్యంగా “పుష్ప 2” ప్రీ రిలీజ్ బిజినెస్ రియాలిటీకి దూరంగా ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు. “రామ్ చరణ్, ఎన్టీఆర్‌లను మించే స్థాయి అల్లు అర్జున్‌కు ఉందా?” అని ప్రశ్నిస్తున్నవారు కూడా లేకపోలేదు.

ఏది ఏమైనా, “పుష్ప 2: ది రూల్” సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా మార్కెట్‌లో తన స్థాయిని మరింతగా విస్తరించాలని ప్రయత్నిస్తున్నారు. “పుష్ప: ది రైజ్” సినిమాతో జాతీయ అవార్డు గెలుచుకున్న ఆయన, ఈ సీక్వెల్ ద్వారా మరింత గుర్తింపు పొందాలని భావిస్తున్నారు. డిసెంబర్ 6న విడుదలవుతున్న ఈ సినిమా, భారీ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది చూస్తే తెలుస్తుంది.