Tollywood Releases: తెలుగు సినీ ప్రేక్షకులకు త్వరలోనే పండగ మొదలు కాబోతోంది.. అది వచ్చే ఏడాది వరకు ఉండబోతుంది. వరుసగా భారీ మెగా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ప్రతి మెగా హీరో ఒక్కొక్కరుగా బాక్సాఫీస్ బరిలో దిగేందుకు సిద్ధమవ్వడంతో థియేటర్లు కళకళలాడబోతున్నాయి. ఈ మెగా జాతరకు నాంది పలుకుతూ, నవంబర్ 14న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన “మట్కా” సినిమా విడుదల కానుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా, వరుణ్ తేజ్ కెరీర్లో రెండో పాన్ ఇండియా చిత్రం కావడం విశేషం.
Mega Lineup of Tollywood Releases from Varun Tej to Pawan Kalyan
గత కొంతకాలంగా వరుణ్ తేజ్‌కు సరైన విజయాలు దక్కడం లేదు. “గని”, “F3” వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో, “మట్కా”పై ఆయన చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా విడుదల తర్వాత తెలుగు సినిమా అభిమానులను మరింత ఉత్కంఠకు గురిచేస్తూ సంక్రాంతి బరిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ “గేమ్ ఛేంజర్”తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జనవరి 10న ఈ సినిమా విడుదల అవుతుందని అధికారికంగా ప్రకటించారు. వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్లోనే విడుదల కావాల్సింది, కానీ అదే నెలలో పాన్ ఇండియా స్థాయిలో “పుష్ప 2” విడుదల కావడంతో, “గేమ్ ఛేంజర్”ను జనవరి 10కి వాయిదా వేశారు.
Also Read: Producer Naga Vamsi: మోక్షజ్ఞ తొలి సినిమా పై కీలకమైన లీక్ ఇచ్చిన నిర్మాత!!
“గేమ్ ఛేంజర్” విడుదల వాయిదా కారణంగా మెగాస్టార్ చిరంజీవి “వాల్తేరు వీరయ్య” తర్వాత నటించిన “విశ్వంభర” సినిమా కూడా వాయిదా పడింది. మొదట ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నప్పటికీ, షూటింగ్ ఆలస్యం కావడం, సాంకేతిక పనులు పూర్తి కావడంలో ఆలస్యం కావడంతో, “విశ్వంభర”ను సమ్మర్‌కి వాయిదా వేశారు. దీంతో చిరు అభిమానులు కొంత నిరాశకు గురైనా, మెగా స్టార్ సినిమా త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుందనే ఆశతో ఉన్నారు.
ఈ మూడు సినిమాల తర్వాత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు సినిమాలతో బాక్సాఫీస్‌ను హోరెత్తించనున్నారు. “హరిహర వీరమల్లు” మరియు “OG” సినిమాలు వచ్చే ఏడాది ఏప్రిల్‌కి లేదా ఆ తర్వాత ఎప్పుడైనా విడుదల కావచ్చు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఈ రెండు సినిమాల షూటింగ్లలో బిజీగా ఉన్నారు. షూటింగ్ ఆలస్యం అవుతున్నప్పటికీ, ఇకపై వాయిదాలు లేకుండా పనులను పూర్తి చేయాలని చిత్ర బృందాలు పకడ్బందీగా ప్రయత్నిస్తున్నాయి.