Rajamouli: దర్శక ధీరుడుగా తెలుగు చిత్రసీమ పరిశ్రమ గురించి దేశ విదేశాలు గొప్పగా మాట్లాడుకునే విధంగా తన సినిమాలతో చేసి చూపించారు రాజమౌళి. అందరూ ముద్దుగా జక్కన్న అని పిలుచుకుంటూ ఉంటారు ఈ డైరెక్టర్ ని.ఇక రాజమౌళి చేతిలో ఎవరైనా హీరో పడ్డారంటే కచ్చితంగా ఆ హీరో మరో మూడు నాలుగు సంవత్సరాల వరకు వేరే సినిమా కి డేట్స్ కేటాయించలేరు. ఈయన ఏదైనా సినిమా తీస్తే టైం ఎక్కువగా తీసుకున్నప్పటికీ సినిమా మాత్రం అందరిని అబ్బురపరిచేలా ఉండాలి అనుకుంటారు.
Do you know Pan India director Rajamouli has remade that movie
అందుకే ఇప్పటి వరకు ఆయన దర్శకత్వం చేసిన ఒక్క సినిమా కూడా ఫ్లాప్ అవ్వలేదు.. ఓటమి ఎరగని డైరెక్టర్ గా రాజమౌళి మొదటి ప్లేస్ లో ఉన్నారు. అయితే అలాంటి రాజమౌళి ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో ఆ ఒక్క మూవీని మాత్రం రీమేక్ చేసారట. మిగతావన్నీ తన సొంతంగా తీసారట.మరి ఇంతకీ రాజమౌళి రీమేక్ చేసిన సినిమా ఏంటి అనుకుంటున్నారా.. (Rajamouli )
Also Read: Chiranjeevi: నా ఫేవరెట్ ప్రొడ్యూసర్ కు శుభాకాంక్షలు.. కల్కి విజయంపై స్పందించిన చిరు..!
ఆ సినిమా ఏంటో కాదు.సునీల్ హీరోగా సలోని హీరోయిన్.. వచ్చిన మర్యాద రామన్న మూవీ. అవును మీరు వినేది నిజమే. ఈ సినిమాని హాలీవుడ్ మూవీ అయినటువంటి అవర్ హాస్పిటాలిటీ మూవీ ని రీమేక్ చేశారట.. ఇక ఈ విషయం స్వయంగా రాజమౌళి గారే చెప్పారు. అంతేకాదు ఈ సినిమా హిట్ అయిన క్రెడిట్ కూడా ఆ సినిమా వాళ్లకే ఇచ్చేశారు.అయితే అవర్ హాస్పిటాలిటీ రీమేక్ హక్కులను కొనుగోలు చేయాలని రాజమౌళి అనుకున్నారట.
కానీ అప్పటికే ఆ సినిమా తీసిన వాళ్ళు ఎవరు కూడా బతికి లేరు.ఎందుకంటే ఈ సినిమా ఇప్పటిది కాదు ఒక 100 సంవత్సరాల క్రితం దట. అలా ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవరూ బ్రతికి లేకపోవడంతో రాజమౌళి రీమేక్ హక్కులు కొనుగోలు చేయకుండానే సినిమా రీమేక్ చేశారు.కానీ ఈ సినిమా హిట్ అయ్యాక దీని క్రెడిట్ మొత్తం వారికే ఇచ్చేశారు. ఇక మర్యాద రామన్న మూవీ 12 కోట్ల బడ్జెట్ పెట్టి తీస్తే 40 కోట్ల వసూళ్లు చేసి సూపర్ హిట్ గా నిలిచింది.(Rajamouli )