Silk Smitha Impact on Indian Cinema: A Deep Dive

Silk Smitha: సిల్క్ స్మిత… ఈ పేరు భారతీయ సినిమా చరిత్రలో ఒక ప్రత్యేకమైన ముద్ర వేసింది. ఆమె పాత్రలు మరియు ఐటెమ్ సాంగ్‌లతో అపారమైన గుర్తింపు పొందారు. కేవలం 18 ఏళ్ల సమయంలో 450కి పైగా సినిమాల్లో నటించి, ఇండియన్ సినిమా చరిత్రలో అరుదైన నటిగా నిలిచిపోయారు. సిల్క్ స్మిత తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్‌ని సృష్టించుకుని, స్టార్ హీరోలకు సమానంగా పారితోషికం పొందేవారు.

Silk Smitha Impact on Indian Cinema: A Deep Dive

సిల్క్ స్మిత పేదరికంలో జన్మించారు. హైస్కూల్ చదువు మానేసి, తన కుటుంబాన్ని కాపాడటానికి ఉద్యోగం చేయాల్సి వచ్చింది. చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న ఆమె, భర్త వేధింపుల కారణంగా అతన్ని విడిచి పెట్టి చెన్నైకి వెళ్లారు. సినిమా అవకాశాల కోసం అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. తమిళ దర్శకుడు విను చక్రవర్తి “వండిచక్కరం” సినిమాలో సిల్క్ స్మితకు బార్ గర్ల్ పాత్ర ఇవ్వగా, ఈ సినిమా ఆలస్యంగా విడుదలైనప్పటికీ, మలయాళంలో ఆమెకు మంచి అవకాశాలు వచ్చినాయి. ఈ సినిమా తరువాత, ఆమె అసలు పేరు విజయలక్ష్మి వడ్లపాటి నుండి “సిల్క్ స్మిత”గా మారిపోయింది. హీరోయిన్‌గా అనేక సినిమాల్లో నటిస్తూ, ఆమెకు స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నారు.

Also Read: Akhil Akkineni: మళ్ళీ అదే తప్పు చేస్తున్న అఖిల్.. భయపడుతున్న ఫ్యాన్స్!!

కానీ, సిల్క్ స్మిత జీవితం ఎప్పుడూ సుఖమయంగా లేదు. ఆమె నమ్మిన రాధాకృష్ణ అనే వ్యక్తి ఆర్థికంగా మోసం చేశాడు, అలాగే ఆమెకు అనేక మంది మేకర్స్ ఉపయోగించుకుని వదిలేశారు. ఈ వరుస మోసాల కారణంగా ఆమె మానసికంగా బాధపడటంతో పాటు, మద్యం తాగడం అలవాటు చేసుకున్నారు. ఈ కష్టాల వల్ల ఆమె క్షీణించిన తరువాత, 1996 సెప్టెంబర్ 23న ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు అప్పట్లో చెప్పారు. ఆమె అంత్యక్రియలకు సినిమా ప్రముఖులు రాలేదు, కానీ యాక్షన్ కింగ్ అర్జున్ మాత్రం హాజరయ్యారు. “అలిమయ్య” సినిమా షూటింగ్ సమయంలో సిల్క్ స్మిత సరదాగా “నేను చనిపోతే నీవైనా వస్తావా?” అని అడిగారు, అర్జున్ మాటిచ్చారు. ఆ మాటను నిలబెట్టుకోవడానికి అర్జున్ ఆమె అంత్యక్రియలకు వచ్చారని చెప్పారు.

ఎన్నో సవాళ్లను ఎదుర్కొని తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. అయినా, ఆమెకు ఎదురైన మోసాలు, ఆర్థిక కష్టాలు ఆమె జీవితాన్ని కష్టతరంగా మార్చాయి. ఆమె జీవితం ఒక ఆసక్తికరమైన కథ, అయితే, ఆమె అనుభవించిన బాధలు కూడా చాలా పీడాకరంగా ఉన్నాయి. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ఎంతో విలువైన కీర్తిని అందించారు సిల్క్ స్మిత.