Kuppam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఏపీలో ఓడిపోయిన తర్వాత ఆ పార్టీలో నేతలు ఎవరు ఉండటం లేదు. ఒక్కొక్కరు పార్టీ నుంచి జారిపోతున్నారు. అవకాశాల కోసం కూటమి పార్టీలోకి వెళ్తున్నారు కొంతమంది అవకాశవాద నేతలు. అయితే ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు ఇలాగ అయిన కుప్పం నియోజకవర్గంలో వైసిపి పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. Kuppam

YCP party office closed in Kuppam

కుప్పం నియోజకవర్గం లో ఉన్న వైసిపి కార్యాలయాన్ని మూసివేసేందుకు భరత్.. ప్లాన్ చేస్తున్నారట. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కుప్పం నియోజకవర్గం లో వైసీపీ నేతలు అందరూ టిడిపిలోకి వెళ్తున్నారని సమాచారం. ఇప్పటికే కీలక నేతలు అందరూ టిడిపిలోకి వెళ్లిపోయారట. దీంతో చేసేది ఏమీ లేక వైసిపి కుప్పం అభ్యర్థి భరత్.. ఆ కార్యాలయాన్ని రెస్టారెంట్ కు ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. Kuppam

Also Read: Telangana: తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనం..రేవంత్ సంచలన నిర్ణయం ?

దీంతో కుప్పంలోని వైసీపీ నేతలు…భరత్ పై సీరియస్ అవుతున్నారట. అధికారం చంద్రబాబుకు శాశ్వతం కాదని… ఇప్పుడే పార్టీ క్లోజ్ కాలేదని చురకలాంటిస్తున్నారట. ఈ విషయంపై జగన్మోహన్ రెడ్డి వరకు పంచాయతీ వెళ్లిందట. దీనిపై త్వరలోనే జగన్మోహన్ రెడ్డి యాక్షన్ కూడా తీసుకోనున్నారని సమాచారం. Kuppam