Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప: ది రైజ్” చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, అల్లు అర్జున్ పోషించిన పుష్పరాజ్ పాత్ర ప్రేక్షకులను కట్టిపడేసింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ ప్రతిభకు విమర్శకుల ప్రశంసలు దక్కగా, ఆయనకు జాతీయ అవార్డులో ఉత్తమ నటుడిగా గౌరవం లభించడం విశేషం. “పుష్ప: ది రైజ్” భారీ విజయంతో, దాని సీక్వెల్ అయిన “పుష్ప2: ది రూల్”పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Pushpa 2 vs Sankranti 2025 Releases: Box Office Battle Brewing
పుష్ప 2 విడుదల తేదీ గురించి అభిమానులు చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే ఈ చిత్రాన్ని డిసెంబర్ 6, 2024న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ తాజా సమాచారం ప్రకారం, డిసెంబర్ 5నే సినిమాని విడుదల చేసే అవకాశముందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పుష్ప మొదటి భాగం లాగే, పుష్ప 2 కూడా భారీ బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించితే, తెలుగు రాష్ట్రాల్లో దీర్ఘకాలం థియేటర్లలో రన్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా పాన్-ఇండియా స్థాయిలో కూడా భారీగా విడుదల కానుంది.
Also Read: Samantha: కొత్త బాయ్ ఫ్రెండ్ తో చక్కర్లు కొడుతున్న సమంత.. వీడియో వైరల్!!
ఇది సాధారణ సినిమా కాకుండా, బాక్సాఫీస్ దగ్గర కూడా ప్రభావం చూపే చిత్రంగా ముస్తాబవుతోంది. ముఖ్యంగా, సంక్రాంతి సీజన్ రాబోతున్న నేపథ్యంలో, పుష్ప 2 విడుదల చేసిన తర్వాత దీర్ఘకాలం మంచి కలెక్షన్లు సాధిస్తే, సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యే రామ్ చరణ్ “గేమ్ ఛేంజర్”, వెంకటేష్ మరియు బాలకృష్ణ నటిస్తున్న సినిమాలపై ప్రభావం చూపవచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పుష్ప 2 మాస్ ఎలిమెంట్స్, భారీ బడ్జెట్, అల్లు అర్జున్ క్రేజ్ ఈ సినిమాని సంక్రాంతి బరిలో నిలిపే అవకాశాలు మరింత పెంచుతున్నాయి.
అయితే, పుష్ప 2 ప్రభావం సంక్రాంతి సినిమాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియాలంటే, సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. ఈ ఊహాగానాలన్నీ పుష్ప 2 యొక్క విజయంపై ఆధారపడి ఉంటాయి. అందుకే, ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే మంచి టాక్ వస్తే, తెలుగు సినీ పరిశ్రమలో 2024 చివరి నెల మరియు 2025 సంక్రాంతి సీజన్ అయ్యేంత వరకు పుష్ప 2 సినిమా ఓవరాల్గా ప్రభావం చూపవచ్చని భావిస్తున్నారు.