Prabhas: టాలీవుడ్‌లో ప్రభాస్ తన సినిమా ప్రస్థానాన్ని “ఈశ్వర్” సినిమాతో ప్రారంభించారు. ఆ చిత్రంతో తాను మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, “వర్షం” మరియు “డార్లింగ్” వంటి చిత్రాలతో లవర్ బాయ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఈ రెండు వేర్వేరు తరహా పాత్రలతో తెలుగు సినీ అభిమానుల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. అయితే “బాహుబలి” సినిమాతో ప్రభాస్ కెరీర్‌లో సర్వం మారిపోయింది.. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆయనకు పాన్ ఇండియా స్టార్ హోదా తీసుకొచ్చింది.
Prabhas Stepping Stone to Worldwide Fame
2015లో విడుదలైన “బాహుబలి: ది బిగినింగ్” తెలుగు సినీ పరిశ్రమను శాశ్వతంగా మార్చింది. ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నా వంటి తారాగణం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అందుకు తోడు ఎం.ఎం. కీరవాణి అద్భుతమైన సంగీతం ప్రేక్షకుల గుండెల్లో నిలిచింది. ఆర్క మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ మరియు దేవినేని ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు సమర్పకుడిగా వ్యవహరించారు. “బాహుబలి: ది బిగినింగ్” సినిమా విడుదలైన కొద్ది రోజుల్లోనే దక్షిణాదిలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
Also Read: Vikram: విక్రమ్ ఆ బాలీవుడ్ హీరోయిన్ ని ప్రేమించారా.?
రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్లకు పైగా వసూళ్లు సాధించి విజయ తీరాలకు చేరింది. ప్రభాస్ కెరీర్‌లో ఇదో మైలురాయిగా నిలిచింది. అంతకుముందు వరకు కేవలం తెలుగు సినిమాలలో ప్రభాస్‌కి ఉన్న ఫాలోయింగ్, “బాహుబలి”తో దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలోకి మారిపోయింది. ఈ సినిమా ప్రభాస్‌కి మాత్రమే కాదు, తెలుగు సినిమాకి కూడా పాన్ ఇండియా స్థాయి అందించింది. దీనికి కొనసాగింపుగా వచ్చిన “బాహుబలి 2: ది కంక్లూజన్” ప్రభాస్ క్రేజ్‌ను మరింత పెంచింది.
“బాహుబలి 2: ది కంక్లూజన్” 2017లో విడుదలై చరిత్ర సృష్టించింది. రూ.250 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి నూతన రికార్డులు నెలకొల్పింది. ఈ సినిమా ద్వారా ప్రభాస్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఇంకా ఈ సీక్వెల్ సృష్టించిన రికార్డులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన ఈ చిత్రాలు తెలుగు సినిమా పరిశ్రమకు గర్వకారణంగా నిలిచాయి.