Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరులోనే పవర్ ఉంది. సన్నగా కరెంట్ తీగలా ఉండే ఈయన హీరో అవుతారా అని చాలామంది అప్పట్లో అనుకునే వారట. అలాంటి పవన్ కళ్యాణ్, కరెంటు తీగ ముట్టుకుంటే ఎలా షాక్ కొడుతుందో ఆ విధంగానే ఇండస్ట్రీలో కూడా తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నా కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటనా తీరు చాలా డిఫరెంట్ గా ఉంటుంది.
Did Pawan Kalyan have such a big love story before marriage
అందరి హీరోలకు అభిమానులు ఉంటే, అందరి అభిమానులు పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్స్ గా ఉంటారు. ఈ విధంగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో కూడా సక్సెస్ అవుతూ దూసుకుపోతున్నారు. అయితే ఆయన సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు ఒక చక్కని ప్రేమ కథ ఉందట. మరి ఆయన లవ్ చేసింది ఎవరిని.. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాకముందు చాలా భయపడే వ్యక్తి. అమ్మాయిలకు ఆమడ దూరంలో ఉండేవారట. (Pawan Kalyan)
Also Read: Nani: ఆ హీరోయిన్ తో నాని ఎఫై**.. పెళ్ళి వరకూ వెళ్లి బ్రేకప్.?
అయితే ఆయన సినిమాలకు ముందు కంప్యూటర్ క్లాస్ లకు వెళ్లేవారట. అయితే ఈ క్లాసులకు వెళ్లే సమయంలో అక్కడే ఒక అందమైన అమ్మాయిని చూశారట.. ఆ క్లాసుల్లో ఉండేటువంటి చాలామంది బాయ్స్ ఆ అమ్మాయితో ఎంతో మాట్లాడాలని ట్రై చేశారట. కానీ ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడేది కాదని, ఎంతో బిడియస్తుడైనటువంటి పవన్ తో మాట్లాడేదని, దీంతో వారి కంప్యూటర్ క్లాసులో ఉండేటువంటి బాయ్స్ అంతా కలిసి పవన్ కు మరియు ఆమెకు మధ్య ఏదో నడుస్తుందని అప్పుడే ఒక రూమర్ క్రియేట్ చేశారట.
దీంతో పవన్ కళ్యాణ్ కూడా అది ప్రేమే కావచ్చు అనుకొని ఓ రోజు తన కారులో ఆమెను ఎక్కించుకొని దూరంగా తీసుకెళ్లి ప్రపోజ్ చేశారట. వెంటనే అమ్మాయి నీ ఏజ్ ఎంత, నా ఏజ్ ఎంత అంటూ కోపానికి వచ్చి ఇష్టం లేదని మొహం మీద చెప్పిందట. దీంతో పవన్ కళ్యాణ్ చాలా రోజులపాటు డిప్రెషన్ లోకి వెళ్లి పోయారట. అయితే ఈ విషయాన్ని ఆయన గోకులంలో సీత సినిమా ఇంటర్వ్యూ చేసే సమయంలో బయటపెట్టారు. కానీ ఆ అమ్మాయి ఎవరు అనే విషయాలు మాత్రం గోప్యంగా ఉంచారు.(Pawan Kalyan)