![Rajamouli movie with Pawan Kalyan.. is it true](https://telugu.pakkafilmy.com/wp-content/uploads/2024/06/pawan-3-1024x576.jpg)
![Rajamouli movie with Pawan Kalyan.. is it true](https://telugu.pakkafilmy.com/wp-content/uploads/2024/06/pawan-3-1024x576.jpg)
Rajamouli: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయాల్లో కూడా తన పవర్ చూపించారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఓవైపు తన జనసేన పార్టీని మంచి స్థాయిలో నిలబెట్టడమే కాకుండా తానూ ఓ పెద్ద రాజకీయ నాయకుడిగా ఎదిగిపోయారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు అంటే అది పవన్ కళ్యాణ్ చలవే అని చెప్పవచ్చు.
Rajamouli movie with Pawan Kalyan.. is it true
అలాంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇదే తరుణంలో ఆయన ఇక సినిమాలు చేయరని అనేక వార్తలు వినిపిస్తున్నాయి. కానీ తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది.అదేంటంటే పవన్ కళ్యాణ్ రాజమౌళితో ఓ సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. (Rajamouli)
Also Read: Rajamouli: పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి ఆ సినిమాని రీమేక్ చేశారని మీకు తెలుసా..?
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారహి అమ్మవారి దీక్ష చేపట్టారు. ఈ దీక్ష 11 రోజులపాటు సాగుతుందట. అయితే పవన్ కళ్యాణ్ మీడియా వీరుడు రామోజీరావు సంస్మరణ సభకు హాజరయ్యారు. అదే సభ కు రాజమౌళి కూడా హాజరయ్యారు.ఇదే తరుణంలో రాజమౌళి పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఎదురెదురు పడడంతో కలిసి కాసేపు ముచ్చటించారు.
![Rajamouli movie with Pawan Kalyan.. is it true](https://telugu.pakkafilmy.com/wp-content/uploads/2024/06/maxresdefault-1-3-1024x576.jpg)
![Rajamouli movie with Pawan Kalyan.. is it true](https://telugu.pakkafilmy.com/wp-content/uploads/2024/06/maxresdefault-1-3-1024x576.jpg)
అయితే దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో వీరిద్దరూ సినిమాల గురించే మాట్లాడుకున్నారని, ఎప్పటికైనా రాజమౌళి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయాలని జక్కన్న కోరాడని అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజముందో అబద్ధం ఉందో అనేది తెలియదు కానీ, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.(Rajamouli)