Pushpa 2: ‘పుష్ప 2: ది రూల్’ సినిమా విడుదల తేదీని ముందుకు జరిపినట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా ముందుగా డిసెంబర్ 6న విడుదల కావాల్సి ఉండగా, ఇప్పుడు డిసెంబర్ 5న థియేటర్లలోకి రానుంది. గతంలో ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీ ఆగస్టు లో ఉంటుందని చెప్పగా, అది డిసెంబర్ 5 లేదా 20లో ఉంటుందని చెప్పారు. అలా 6 న ఈ సినిమాను విడుదల చేయడానికి నిర్ణయించారు. ఇప్పుడు డిసెంబర్ 5న విడుదల చేయడం విశేషం. అయితే ఈ మార్పు మేకర్స్ కు కలిసొచ్చే అంశం అని అంచనా వేస్తున్నారు.
Pushpa 2 Release Date Change Explained
కరోనా కి ముందు తెలుగు సినిమాలకు నాలుగు రోజుల వీకెండ్ ఉంటుంది. అంటే గురువారం ప్రీమియర్స్, శుక్ర, శని, ఆదివారాలు. కానీ, కరోనా తర్వాత పాన్ ఇండియా సినిమాలకు ఐదు రోజుల వీకెండ్ కలిసి వస్తోంది. బుధవారం ప్రీమియర్స్ వేయడం ద్వారా ‘కాంతార’, ‘జైలర్’, ‘లియో’ వంటి సినిమాలు ఎక్కువ లాభాలను పొందాయి. అంతేకాకుండా, గురువారం ప్రీమియర్స్ ఉన్న సినిమాలకు నార్త్ అమెరికా, యుకె వంటి దేశాల్లో ఐమాక్స్, పిఎల్ఎఫ్ వంటి ప్రీమియం ఫార్మాట్ స్క్రీన్లు దొరకడం కష్టం అవుతోంది. హాలీవుడ్ స్టూడియోలు గురువారం తమ సినిమాల షోలు తగ్గించవద్దని థియేటర్లకు ఆంక్షలు విధిస్తున్నందున ఇతర సినిమాలకు ఇబ్బంది ఉంది.
Also Read: Janasena: జనసేనలోకి మేకతోటి సుచరిత ?
డిసెంబర్ నెలలో ‘పుష్ప 2’తో పాటు రెండు హాలీవుడ్ సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. డిస్నీ యొక్క యానిమేటెడ్ మ్యూజికల్ అడ్వెంచర్ ‘మోవానా 2’ నవంబర్ 27న, సూపర్ హీరో సినిమా ‘క్రావెన్: ది హంటర్’ డిసెంబర్ 13న విడుదల కానున్నాయి. ఈ సినిమాలతో ‘పుష్ప 2’ స్క్రీన్లను పంచుకోవాల్సి ఉంటుంది. థాంక్స్ గివింగ్ డే తర్వాత, బుధవారం రోజున హాలీవుడ్ సినిమాలకు అతి తక్కువ వసూళ్లు వస్తాయని పరిగణనలోకి తీసుకోవాలి. ఈ ఏడాది థాంక్స్ గివింగ్ తర్వాత బుధవారం డిసెంబర్ 4 అవుతుంది. అందుకే, ‘పుష్ప 2’కు ఓవర్సీస్ ప్రీమియర్స్ డిసెంబర్ 4న జరగడం చాలా సమంజసమైన నిర్ణయం.
ఈ రోజున హాలీవుడ్ సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు రారని స్టూడియోలకు తెలిసి ఉండడం వల్ల, ‘పుష్ప 2’కి ఐమాక్స్, పిఎల్ఎఫ్ వంటి ప్రీమియం ఫార్మాట్ స్క్రీన్లు ఎక్కువగా దొరకే అవకాశం ఉంది. ప్రీమియర్స్ రోజునే భారీ వసూళ్లు రాబట్టడానికి, ఐదు రోజుల ఫస్ట్ వీకెండ్‌ను సొంతం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటిస్తున్నాయి. విడుదల తేదీ అనుకూలంగా ఉండటంతో, నార్త్ అమెరికాతో పాటు అన్ని ఓవర్సీస్ దేశాల్లో ‘పుష్ప 2’ రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ సాధిస్తుందని అంచనా వేయబడింది. ఈ చిత్రం డిసెంబర్ 4న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.