సినిమా: Narudi Brathuku Natana
నటీనటులు: దయానంద్ రెడ్డి, నితిన్ ప్రసన్న, శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వైవా రాఘవ్, దయా తదితరులు
ఎడిటర్: బొంతల నాగేశ్వరరావు
సినిమాటోగ్రఫీ: ఫహద్ అబ్దుల్ మజీద్
సంగీతం: లోపేజ్
నిర్మాణం: పీపుల్స్ మీడియా, టీజీ విశ్వ ప్రసాద్, సింధు రెడ్డి
దర్శకత్వం : రిషికేశ్వర్ యోగి
విడుదల తేది: 25-10-2024

పలు అంతర్జాతీయ వేదికల్లో అవార్డులు అందుకున్న చిత్రం “నరుడు బ్రతుకు నటన”. ఈ ప్రత్యేకమైన చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ చూసి మెచ్చి, విడుదలకు ముందుకు రావడం విశేషం. శివ కుమార్,నితిన్ ప్రసన్న,శ్రుతి జయన్,దయానంద్,వైవా రాఘవ్,ఐశ్వర్య తదితరులు ప్రధానపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రిషికేశ్వర్ యోగి దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ రోజు విడుదలయిన ఈ సినిమా ఏవిధంగా ఉందో ఈ సమీక్షలో తెలుసుకుందాం.

Narudi Brathuku Natana Movie Review and Rating

కథ: హీరో కావాలనే ఆకాంక్షతో సత్య (శివ కుమార్) ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ తండ్రి దగ్గరి నుంచి ప్రతి ఒక్కరు తాను యాక్టర్ గా పనికిరాడు అంటుంటారు.తల్లి లేకుండా పెరిగిన సాత్యకి మనుషుల విలువ, బంధాలు వంటివాటికి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వవు. ఓ ఇన్సిడెంట్ వల్ల తనను తాను తెలుసుకునే ప్రయత్నంలో కొచ్చిలోని ఓ గ్రామానికి చేరుతాడు. అక్కడ సల్మాన్ (నితిన్ ప్రసన్న) పరిచయమవుతాడు. ఆశ్రయం లేని సత్య కి తోడుగా ఉండి అక్కడి ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. ఈ క్రమంలో మనుషులు,వీరిమధ్య ఉండే బంధాలు, ఎమోషన్స్, విలువలు తెలుసుకుని తన కల వైపు ఏవిధంగా ముందుకు సాగాడు అనేది సినిమా కథ.

నటీనటులు: శివ కుమార్, నితిన్ ప్రసన్న తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. సత్య, సల్మాన్ పాత్రల ద్వారా ప్రేక్షకులకు సులభంగా కనెక్ట్ అవుతారు. శివ తన ఎమోషనల్ నటనతో ఆకట్టుకుంటాడు, నితిన్ ప్రసన్న తన గత సినిమాల్లో కనిపించిన విలనీ యాంగిల్‌ను వదిలి ఈ సినిమాలో హాస్యంతో నవ్విస్తాడు. దయానంద్ కేవలం రెండు మూడు సీన్లకే పరిమితమై చాలా ఇంపాక్ట్ చూపించాడు. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్‌ బాగా చూపించారు. లేఖ, మోనిక పాత్రలు తమ నటనతో అందరినీ ఆకట్టుకుంటాయి. మిగతా పాత్రలు అవసరమైనప్పుడల్లా కనిపించి సినిమా పై మంచి ప్రభావాన్ని పెంచుతాయి.

సాంకేతిక నిపుణులు: ఫస్ట్ హాఫ్‌లో హీరోకు ఎమోషన్ తెలియకపోవడం, కొంచెం స్లో గా కథనం నడిపినా, సెకండాఫ్‌లో సన్నివేశాలు ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తాయి. ఈవిధంగా రాసిన దర్శకుడికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ప్రతి ఒక్క విభాగాన్ని చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఎడిటింగ్‌ పర్వాలేదు. ఈ సినిమాలో నిర్మాత టేస్ట్ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రేక్షకులకు విలువైన చిత్రాన్ని అందించాలనే పట్టుదల కనిపిస్తోంది. ఇలాంటి చిత్రాలను టేకప్ చేసి విడుదల చేయడంలో పీపుల్స్ మీడియా మరియు టీజీ విశ్వ ప్రసాద్ టేస్ట్ ప్రశంసనీయమైనది. విజువల్స్ పరంగా కేరళ అందాల్ని మరింత అందంగా చూపించొచ్చనిపిస్తుంది. పాటలు వినసొంపుగా ఉంటాయి. ఆర్ఆర్ ఎమోషనల్‌గా టచ్ అవుతుంది. మాటలు కొన్ని చోట్ల లోతుగా అనిపిస్తాయి.

ప్లస్ పాయింట్స్:

కథ, కథనం

మ్యూజిక్

ఎమోషన్స్

మైనస్ పాయింట్స్:

ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ నెమ్మదించడం

తీర్పు: కథ చెప్పడం ఎంత సులువో దాన్ని తెరపై ఆవిష్కరించడం నిజంగా కష్టమైన పని. కథలో ఉన్న ఎమోషన్‌ను సరిగ్గా తీసుకురావడం, అదే ఎమోషన్‌తో ప్రేక్షకులను కనెక్ట్ అయ్యేలా చేయడం అంత సులభం కాదు. ఈ విషయంలో నరుడి బ్రతుకు నటన సక్సెస్ అయ్యింది.

రేటింగ్: 3/5