IND VS NZ: మూడు టెస్టుల సిరీస్ లో మొదటి రెండు మ్యాచులలో విజయం సాధించి న్యూజిలాండ్ సిరీస్ కైవసం చేసుకుంది. సొంతగడ్డపై 12 ఏళ్ల అనంతరం భారత్ టెస్ట్ సిరీస్ కోల్పోయింది. పూణే టెస్ట్ రెండు ఇన్నింగ్స్ లోను భారత్ పేలవంగా బ్యాటింగ్ కు దిగింది. IND VS NZ

IND vs NZ 3 Mistakes That Led To Indias Shameful Defeat

తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా కేవలం 156 పరుగులకే ఆల్ అవుట్ అవడంతో కివీస్ రెండో ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యాన్ని పొందింది. భారత జట్టులోని సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మొదటి రెండు ఇన్నింగ్స్ లోను పూర్తిగా నిరాశపరిచారు. పూణే పిచ్ స్పిన్ కు అనుకూలంగా తీర్చిదిద్దారు. IND VS NZ

Also Read: Smita Sabharwal: స్మితా సబర్వాల్‌కు రేవంత్ బంపర్ గిఫ్ట్.. ?

ఈ మ్యాచ్ లో టీమిండియా చాలా సులభంగా విజయం సాధిస్తుందని అందరూ అంచనా వేశారు. కానీ న్యూజిలాండ్ బౌలర్లు పిచ్ ను సద్వినియోగం చేసుకున్నారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శాంట్నర్ మొదటి ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లు పడగొట్టగా, రెండో ఇన్నింగ్స్ లోను మరో 6 వికెట్లు తీశారు. దింతో 69 ఏళ్ళ తర్వాత భారత గడ్డ పై టెస్ట్ సీరీస్ గెలిచింది న్యూజిలాండ్. IND VS NZ