Varun Tej first love that heroine

Varun Tej: ఆ హీరోయిన్ వరుణ్ తేజ్ ఫస్ట్ లవ్వా .. వింటుంటే ఆశ్చర్యంగా ఉందే అనుకుంటారు ఆమె పేరు తెలిస్తే.మరి ఇంతకీ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఫస్ట్ లవ్ ఎవరో ఇప్పుడు చూద్దాం.. నాగబాబు తనయుడిగా పెదనాన్న చిరంజీవి వారసత్వంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు వరుణ్ తేజ్. ముకుంద మూవీ తో వచ్చి ఫిదా మూవీ తో ఎంతోమందిని ఫిదా చేశారు.అయితే ఈయన చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ మెగా ప్రిన్స్ ట్యాగ్ తెచ్చుకున్నారు.

Varun Tej first love that heroine

అయితే అలాంటి వరుణ్ తేజ్ ముకుంద తో ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే ఆ మూవీ హీరోయిన్ పూజ హెగ్డే తో ప్రేమలో పడ్డారట. ముఖ్యంగా ఈ సినిమాలో పూజ హెగ్డే కి వరుణ్ తేజ్ కి మధ్య ఆన్ స్క్రీన్ రొమాంటిక్ సన్నివేశాలు ఏమీ ఉండవు.కానీ వీరిద్దరి జోడి పర్ఫెక్ట్ అనేలా అభిమానులకు కనెక్ట్ అయింది. ముఖ్యంగా పూజ హెగ్డే,వరుణ్ తేజ్ ల హైట్ చాలా కరెక్ట్ గా సెట్ అయింది.(Varun Tej)

Also Read: Aishwarya Rai: భర్తతో విడాకులు.. రహస్యంగా పెళ్లి.. హనీమూన్ కి కూడా వెళ్లిన ఐశ్వర్యరాయ్..?

వరుణ్ తేజ్ పెళ్లి చేసుకుంటే పూజ హెగ్డేనే పెళ్లి చేసుకోవాలి అనేంతలా అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే వీరిద్దరి జోడి అంత బాగుంది కాబట్టి.అయితే ఈ సినిమా చేసే సమయంలోనే పూజ హెగ్డే తో వరుణ్ తేజ్ ప్రేమలో పడిపోయారట. కానీ పూజ హెగ్డే మాత్రం అప్పుడే సినిమాల్లోకి రావడంతో ఇలాంటి వాటికి నా లైఫ్ లో చోటు ఇవ్వాలి అనుకోవడం లేదు.ప్రస్తుతం నా ఫోకస్ మొత్తం కెరియర్ మీద ఉంది.

Varun Tej first love that heroine

ఇలాంటి టైం లో మీరు పెద్ద ట్విస్ట్ ఇవ్వకండి అంటూ చాలా ఫన్నీగా రియాక్ట్ అయ్యి రిజెక్ట్ చేసిందట. అలా వరుణ్ తేజ్ ఫస్ట్ లవ్ బ్రేకప్ అయిపోయింది అంటూ ఈ సినిమా విడుదలైన సమయంలో వరుణ్ తేజ్ పై రూమర్లు వినిపించాయి. అయితే ప్రస్తుతం ఈ రూమర్ మళ్ళీ నెట్టింట వైరల్ అవ్వడంతో పూజ హెగ్డే కనుక వరుణ్ తేజ్ ని అప్పుడే ఓకే చేసి ఉంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీలో రాణిలా బతికేది.ఇప్పుడు అవకాశాలు లేక ఎన్ని ఇబ్బందులు పడుతుందో అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.(Varun Tej)