Modi: వచ్చే నెలలో కజకిస్తాన్లో షాంఘాయ్ సహకార సంస్థ సదస్సుకు మోదీ వెళ్ళట్లేదని తెలుస్తోంది. మోడీ తరపున కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ హాజరు కాబోతున్నారని తెలుస్తోంది. భారత ప్రతినిధి బృందానికి కేంద్ర మంత్రి నాయకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… వచ్చే నెలలో ఈ షాంగై సహకార సంస్థ సదస్సు జరగబోతుంది. అయితే ప్రధాన నరేంద్ర మోడీ వెళ్లాల్సి ఉంది కానీ ఆయన ఈ సదస్సుకి దూరంగా ఉన్నారట. మోడీ తరపున విదేశాంగ మంత్రి జయశంకర్ వెళ్లబోతున్నారు.

Modi drop out from SCO summit

భారత ప్రతినిధి బృందానికి కేంద్ర మంత్రి నాయకత్వం వహిస్తున్నారు జూలై మూడు నాలుగు తేదీల్లో జరగనున్న షాంగై సదస్సుకు ప్రధాన నరేంద్ర మోడీ హాజరవుతారని తొలత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి అయితే తాజాగా అయినా వెళ్లట్లేదని విదేశాంగ అధికార ప్రతినిధి జైష్వాల మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. గత ఏడాది ఎస్సీఓ సదస్సుకు భారత ఆతిధ్యం ఇవ్వగా చైనా రష్యా ప్రధానులు రాలేమని చెప్పడంతో వర్చువల్ గా సదస్సును నిర్వహించారు. అయితే ఇప్పుడు మోడీ ఎందుకు వెళ్లట్లేదు అనే దాని గురించి కారణాలైతే తెలియదు. మోడీ వెళ్ళకపోవడానికి ఏ కారణాలు కూడా బయట పెట్టలేదు అయితే చైనా తో సంబంధాలు దెబ్బతిన్న కారణంగా పర్యటనకు దూరంగా ఉన్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి.

Also read: Cable System: కేబుల్ కబ్జాకు మాస్టర్ కుట్ర చేస్తున్నారా?

మంగళవారం ప్రెసిడెంట్ కసిం నుండి ప్రధాన నరేంద్ర మోడీ కి ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఇండియా తన వైఖరిని కజికిస్థాన్ కి తెలియజేసినట్లు సమాచారం. ఎస్సీఓలోని తొమ్మిది సభ్య దేశాలు ఉన్నాయి అవి ఏంటంటే భారతదేశం, చైనా, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, పాకిస్తాన్, రష్యా, తజబేకిస్తాన్ అయితే కరోనా మహమ్మద్ ప్రారంభానికి ముందు జరిగిన సమావేశాలకు మోడీ వెళ్లారు. 2022లో ఉక్రెయిన్ యుద్దాన్ని ముగించుకోవడానికి రష్యా అధ్యక్షుడు తో చర్చించడానికి శిఖరాగ్ర సమావేశానికి ఉజ్బెకిస్తాన్ కు మోదీ వెళ్లారు ఇది ఇలా ఉంటే వచ్చే నెలలో జరుగుతున్న ఈ సదస్సుకు మాత్రం ప్రధాన నరేంద్ర మోడీ వెళ్ళట్లేదని తెలుస్తోంది. సదస్సుకు కేంద్ర మంత్రి వెళ్తారట (Modi).