Director tortured Meenakshi Chaudhary

Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి ప్రస్తుతం చేతి నిండా అవకాశాలతో సౌత్ లో బిజీయెస్ట్ హీరోయిన్. ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గానే ది గోట్ మూవీ తో అభిమానులను అరారించింది.తాజాగా లక్కీ భాస్కర్ మూవీ తో రాబోతుంది. అలాగే ఈమె చేతిలో మరిన్ని సినిమా ఆఫర్లు కూడా ఉన్నాయి. ఇక గుంటూరు కారం, ఖిలాడి, హిట్-2 వంటి సినిమాలతో అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది.

Director tortured Meenakshi Chaudhary

అయితే అలాంటి ఈ హీరోయిన్ గురించి రీసెంట్ గా ఒక రూమర్ కోలీవుడ్ మీడియాలో కోడై కూస్తుంది. అదేంటంటే..మీనాక్షి చౌదరి ఓ స్టార్ హీరో కొడుకుని ప్రేమిస్తోందని,వీరిద్దరి పెళ్లి ఫిక్స్ అయింది అంటూ వార్తలు వినిపించాయి. కానీ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని కేవలం అది మీనాక్షి చౌదరిపై పుట్టుకొచ్చిన రూమర్ మాత్రమే అని క్లారిటీ వచ్చింది.. (Meenakshi Chaudhary)

Also Read: Aishwarya Rai: మా రిలేషన్ షిప్ పెద్ద టార్చర్.. అవి చీక‌టి రోజులు..ఐశ్వ‌ర్యరాయ్ షాకింగ్ కామెంట్స్‌!

అయితే ఈ రూమర్ మరువక ముందే మీనాక్షి చౌదరిపై మరో పుకారు చక్కర్లు కొడుతుంది. అదేంటంటే..మీనాక్షి చౌదరికి కోలీవుడ్ లో ఉండే ఓ డైరెక్టర్ అర్ధరాత్రి మెసేజ్లు చేస్తున్నారట. అయితే అర్ధరాత్రి పూట మెసేజ్లు అంటే ఏదో అసభ్యంగా అనుకుంటారు.కానీ అసభ్య మెసేజ్లు కాదు ఆమెకు తన నెక్స్ట్ మూవీలో ఆఫర్ ఇస్తానని ఆ డైరెక్టర్ నేరుగా ఆమెకే మెసేజ్ చేశారట.

Director tortured Meenakshi Chaudhary

కానీ మీనాక్షి చౌదరి మాత్రం రిజెక్ట్ చేసిందట. ఎందుకంటే ప్రస్తుతం ఈమెకు డేట్స్ ఖాళీగా లేవు. అందుకే నెక్స్ట్ ఇయర్ చూద్దామని చెప్పిందట.కానీ డైరెక్టర్ మాత్రం పదే పదే తన నెక్స్ట్ సినిమాలో హీరోయిన్గా చేయాలి అని మెసేజ్ లతో టార్చర్ చేస్తున్నారని కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఓ టాక్ వినిపిస్తోంది.(Meenakshi Chaudhary)