IPL 2025: చెన్నై సూపర్ కింగ్స్ రాబోయే సీజన్ కు తమ స్క్వాడ్ ను ఖరారు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈసారి జట్టులో ఎవరిని ఉంచుకుంటారు ఎవరిని రిటైన్ చేసుకుంటారు అని ప్రతి ఒక్కరిలో ఆందోళన నెలకొంది. ఎమ్మెస్ ధోని తర్వాత సిఎస్కేలో కీలక ఆటగాడిగా రవీంద్ర జడేజా కొనసాగుతున్నారు. IPL 2025
IPL 2025 CHENNAI SUPER KINGS RETAINED AND RELEASED PLAYERS
దీంతో జడేజాను ఖచ్చితంగా సీఎస్కే రిటైన్ చేసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గత సీజన్ లో సీఎస్కే కెప్టెన్ గా ఉన్న ఋతురాజ్ గైక్వాడ్ ను ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంటుందని సమాచారం అందుతోంది. ఈ 27 ఏళ్ల యంగ్ ప్లేయర్ ఐపిఎల్ లో 583 పరుగులను సాధించాడు. IPL 2025
Also Read: Constables: బెటాలియన్ కానిస్టేబుల్స్ కు నిరసనల పోస్టులకు లైక్ కొడితే చర్యలు ?
శివమ్ దూబే కూడా సీఎస్కే జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. శివమ్ దూబేను సీఎస్కే రిటైన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సిఎస్కే కొనుగోలు చేసే మొదటి ఆటగాడు ధోనినే కావడం విశేషం. కొత్త అన్ క్యాప్డ్ ప్లేయర్ నియామకాన్ని మళ్లీ ప్రవేశపెట్టడంతో ధోనీని రూ. 4 కోట్లకు సీఎస్కే రిటైన్ చేసుకోనుంది. IPL 2025