Mobile Restart: ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ ని ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ వలన ఈజీగా అనేక పనులు అయిపోతూ ఉంటాయి. ఒక్కో సారి స్మార్ట్ ఫోన్ కారణంగా కొన్ని ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కొందరు చౌక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వాడితే కొంత మంది మాత్రం ఖరీదైనవి వాడుతూ వుంటారు. స్మార్ట్ ఫోన్స్ అందరికీ జీవితాన్ని ఈజీ చేసేశాయి. అదే సమయంలో ప్రజలు స్మార్ట్ఫోన్లను చెడుగా దుర్వినియోగం చేస్తున్నారు.

Mobile Restart will improve phone speed

ఇవన్నీ పక్కన పెడితే కొన్ని సార్లు ఫోన్ పనితీరు చాలా నెమ్మదిగా ఉంటుంది మీ ఫోన్ పనితీరు గురించి ఆందోళన చెందుతున్నట్లయితే ఈ సమస్యల నివారించడానికి ఒక మార్గం ఉంది. ఎప్పుడైనా మీ ఫోన్ ని రీస్టార్ట్ చేశారా…? అయితే ఎన్ని రోజులు తర్వాత ఫోన్ రీస్టార్ట్ చేయాలి ఈ విషయాలు తప్పక ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మెరుగైన పనితీరు కోసం కనీసం వారానికి ఒకసారి అయినా ఫోన్ ని రీస్టార్ట్ చేయాలి. టెక్ నిపుణులు ఫోన్ ని వారానికి ఒకసారి రీస్టార్ట్ చేయాలని అంటున్నారు.

Also read: Modi: షాంఘై సమస్యకు మోడీ దూరం..!

ఫోన్ స్లో అయ్యే అవకాశాలని ఇది తగ్గిస్తుంది ఫోన్ ఎక్కువ సేపు ఆఫ్ చేయకుండా ఉపయోగించడం వలన ఈ సమస్య ఎక్కువ అవుతుందట. ఒకసారి ఫోన్ రీస్టార్ట్ చేయడం వలన ఫోన్ చల్లబడుతుంది. పైగా మొత్తం అన్ని కూడా సరిగ్గా పని చేస్తాయి. ఫోన్ విపరీతంగా హ్యాంగ్ అవుతున్న యాప్స్ క్రాష్ అవుతున్న లేదంటే బ్యాటరీ బ్యాకప్ తక్కువగా ఉన్న సరే మీరు ఫోన్ ని ఒకసారి రీ స్టార్ట్ చేయాలి ఫోన్ వేడెక్కుతున్నట్లయితే వెంటనే ఫోన్ రీస్టార్ట్ చేయడం మంచిది. ఇలా మీరు రీస్టార్ట్ చేయడం వలన ఇబ్బందులు ఉండవు ఫోన్ మళ్ళీ బాగా పనిచేస్తుంది స్పీడ్ అవుతుంది కూడా (Mobile Restart).

Redmi Note 13 Pro 5G new colour Phone