YS Jagan: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయమ్మ రాసిన లేఖ సంచలనం అయింది. తెలుగుదేశం పార్టీ కూడా ఈ లేఖను సోషల్ మీడియాలో ప్రశ్నించడం ఒక హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో, జగన్ ఆస్తుల్లో షర్మిల వాటా అడుగుతున్న నేపథ్యంలో, షర్మిల ఆస్తుల్లో జగన్‌కు వాటా ఇస్తారా అనే చర్చలు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నాయి. ఈ విషయాలు రాజకీయ వర్గాల్లో చర్చకు రాగా, ప్రజల నిత్యజీవితంలోనూ అవి చర్చనీయాంశంగా మారాయి.
What’s Next for YS Jagan Amidst Family Asset Disputes
షర్మిల, జగన్ ఆస్తుల్లో వాటా కోరుతున్నందుకు, జగన్ జైలుశిక్షలో ఉన్నప్పుడు ఎందుకు వాటా అడగలేదు అనే కామెంట్లు బయటకొచ్చాయి. “అయితే, ఆస్తుల్లో వాటాలు పంచుకోవాలనుకుంటే, 15 సంవత్సరాల క్రితం ఎందుకు పంచుకోలేదు?” అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో, విజయమ్మ షర్మిలపై ప్రేమతో జగన్‌కు అన్యాయం చేస్తున్నారని, ఇది వైఎస్సార్ కుటుంబానికి నష్టం చేకూరుస్తుందని రాజకీయ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Congress: ఏపీ సీఎం చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్!!
2019లో ఎంఓయూ రాసుకున్న తర్వాత ఆస్తుల్లో వివాదం ఏంటి? అనే ప్రశ్నలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. షర్మిల వైసీపీకి, జగన్‌కు చేయాల్సిన నష్టం అన్ని చేసి, ఇప్పుడు ఆస్తుల్లో వాటా అడగడం పై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయమ్మ రాసిన లేఖ అందరూ ఊహించిన విధంగానే ఉందని చెబుతున్న అభిప్రాయాలు సామాజిక మాధ్యమాల్లో వినిపిస్తున్నాయి.
కుటుంబంలోని విబేధాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, రచ్చ కీడ్చి నిందించడం కరమంటూ చర్చ జరుగుతోంది. విజయమ్మ లేఖపై వైసీపీ నేతల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. విజయమ్మ, షర్మిల, జగన్ రాజకీయ కెరీర్‌ను నాశనం చేసే విధంగా అడుగులు వేయడం పై అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయం సాధించడానికి ఈ లేఖ జగన్ సొంత పత్రికలో ఎలా ప్రస్తావించబడుతుందనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు వస్తోంది. రాబోయే రోజుల్లో ఈ వివాదం మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉందని నెట్టింట న్యూస్ వైరల్ అయింది.