Sumanth: అక్కినేని సుమంత్ నిజంగానే పెళ్లయ్యాక మరో హీరోయిన్ తో ప్రేమలో పడ్డారా.. అందుకే కీర్తి రెడ్డి విడాకులు తీసుకొని దూరంగా వెళ్లిపోయిందా.. టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టిన న్యూస్ లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.. ఇండస్ట్రీలో అక్కినేని సుమంత్ అంటారు కానీ ఈయన అసలు పేరు యార్లగడ్డ సుమంత్ .. ఈయన్ని అక్కినేని సుమంత్ అనడానికి కారణం ఏఎన్ఆర్ ఐదుగురు పిల్లలు ఉన్నా కూడా తన కూతురుకి పుట్టిన కొడుకు సుమంత్ ని దత్తత తీసుకున్నారు.
Sumanth fell in love with that heroine
అలా సుమంత్ ని చాలామంది అక్కినేని సుమంత్ గానే గుర్తిస్తారు.అయితే అలాంటి హీరో సుమంత్ అక్కినేని వారసత్వంతోనే సినిమాల్లోకి వచ్చినప్పటికీ హీరోగా నిలబడలేక పోయారు.జనరేషన్ కి తగ్గట్టు కథలు ఎంచుకోకపోవడంతో ఈ హీరో వెనుకబడిపోయారు.అయితే ఈయన సినీ కెరియర్ మాత్రమే కాదు పర్సనల్ కెరియర్ కూడా ఏమంత బాగాలేదు. ఎందుకంటే కీర్తి రెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకొని కొద్ది రోజులకే విడాకులు తీసుకున్నాడు.( Sumanth)
Also Read: Samyuktha Menon: శ్రీలంక అడవుల్లో బాయ్ ఫ్రెండ్ తో సంయుక్త మీనన్ ఎంజాయ్..?
అయితే వీరి విడాకుల విషయంలో ఓ హీరోయిన్ పేరు గట్టిగా వినిపించింది.ఆమెనే కమలినీ ముఖర్జీ.. క్లాస్ మేట్స్,గోదావరి వంటి సినిమాల్లో కలిసి నటించిన ఈ జంట మధ్య ఎఫైర్ వార్తలు వినిపించాయి.ముఖ్యంగా కమలినీ ముఖర్జీతో సుమంత్ ఎఫైర్ పెట్టుకున్న రూమర్ కీర్తి రెడ్డికి తెలిసి ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు వచ్చాయని కమlలిీతో ఫ్రెండ్ షిప్ కట్ చేసుకోకపోతే విడాకులు ఇచ్చేస్తానని సుమంత్ ని బెదిరించి చివరికి కీర్తి రెడ్డి సుమంత్ కి విడాకులు ఇచ్చేసి వెళ్లిపోయింది అనే రూమర్ వినిపించింది.
అయితే చాలామంది సుమంత్ విడాకులు తీసుకున్నాక కమలినీ ముఖర్జీని పెళ్లి చేసుకుంటారని అనుకున్నారు కానీ ఇప్పటివరకు కూడా సుమంత్ పెళ్లి చేసుకోలేదు.ఇక కమలినీ ముఖర్జీ కూడా ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంది. అయితే వీరిద్దరూ రెండో పెళ్లి వార్తలు ఇప్పటికి ఆగడం లేదు.( Sumanth)