Will that heroine be the reason for Chai and Sobhitha separation

Sobhitha: అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున నుంచి మొదలు నాగచైతన్య వరకు రెండు పెళ్లిళ్ల పర్వం అనేది కొనసాగుతోంది. అయితే నాగ చైతన్య స్టార్ హీరోయిన్ అయినటువంటి సమంతను పెళ్లి చేసుకుని కొన్నేళ్లపాటు కాపురం చేసి విడాకులు తీసుకొని విడిపోయారు. వీరి విడాకులకు ఏంటి కారణమనేది ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. కానీ ఒక చూడ చక్కని జంట విడిపోవడంతో అక్కినేని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Will that heroine be the reason for Chai and Sobhitha separation

ఇక వీరి విడాకుల తర్వాత ఎవరి జీవితం వారు చూసుకొని సినిమాల్లో బిజీ అయిపోయారు. కానీ అక్కినేని నాగచైతన్య మాత్రం రెండో పెళ్లికి సిద్ధమైపోయి శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ కూడా జరిపించారు. త్వరలో పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారు. ఇదే తరుణంలో ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి వీరి వివాహం పై దారుణమైన కామెంట్స్ చేశారు. వీరి జాతకాలను పూర్తిగా విశ్లేషిస్తే వీరు పెళ్లి చేసుకున్న మూడేళ్ల తర్వాత విడిపోతారని అన్నారు. (Sobhitha)

Also Read: Shriya: Jr.ఎన్టీఆర్ పరువు తీసిన శ్రియ.. నిర్మాత సూసైడ్ చేసుకున్నాడంటూ..?

ఆయన మాటలపై తీవ్రంగా రియాక్ట్ అయినటువంటి సినీ ప్రముఖులు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో వేణు స్వామికి కమిషన్ నోటీసులు పంపి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఆయనపై ఇలాంటి చర్యలు తీసుకుంటారనేది ఉత్కంఠ గా మారిన సమయంలో ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. వేణు స్వామి చెప్పినట్లు శోభిత నాగచైతన్య విడిపోవడానికి కారణం ఎవరై ఉంటారా అని నెటీజన్లు నెట్టింట్లో చర్చించుకుంటున్నారు. దీనిలో భాగంగానే సమంత పేరు తెరపైకి వచ్చింది.

 Will that heroine be the reason for Chai and Sobhitha separation

సమంత నాగచైతన్య ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నారని, అనూహ్యంగా విడిపోవలసి వచ్చిందని, విడిపోయినా కానీ సమంత తన జీవితంలో మరో వ్యక్తికి అవకాశం లేదని స్పష్టం చేసింది. సమంత మాటలు విన్నటువంటి నెటిజన్లు మళ్లీ సమంత నాగచైతన్య జీవితంలోకి వస్తుందని, దానివల్ల శోభిత నాగచైతన్యలు విడిపోతారని అనుకుంటున్నారు. మరి చూడాలి వీరిద్దరి పెళ్లి తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయనేది ముందు ముందు తెలుస్తుంది.(Sobhitha)