BRS: తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి తెలంగాణ మాజీ మంత్రి హరీష్‌ రావు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. మూసీ నుంచి వాడపల్లికి వరకు రేవంత్ రెడ్డితో పాదయాత్రకు రెడీ.. రేపా? ఎల్లుండా? అంటూ సవాల్‌ చేశారు తెలంగాణ మాజీ మంత్రి హరీష్‌ రావు. టైం చెప్తే కేటీఆర్, నేను.. ఇద్దరం గన్ మెన్లు లేకుండా వస్తాం..‌ రేవంత్ రెడ్డి మూసీపై పాదయాత్రకు రావాలని ఛాలెంజ్‌ చేశారు తెలంగాణ మాజీ మంత్రి హరీష్‌ రావు. BRS

Harish Rao On BRS

నన్ను డీల్ చేయటం కాదు.. మెదటి రేవంత్ రెడ్డి సొంత కుర్చీని కాపాడుకోవాలని చురకలు అంటించారు. రేవంత్ రెడ్డిని ఎలా డీల్ చేయాలో రాసి పెట్టుకుంటున్నామన్నారు తెలంగాణ మాజీ మంత్రి హరీష్‌ రావు. పది నెలల కాలంలోనే 85 వేల కోట్ల అప్పులు చేసింది రేవంత్ ప్రభుత్వం అంటూ సంచలన ఆరోపణలు చేశారు హరీష్ రావు. ఇప్పుడు ఎన్నికలు పెడితే.. బీఆర్ఎస్ కు 100సీట్లు వస్తాయని స్పష్టం చేశారు హరీష్‌ రావు. BRS

Also Read: IPL 2025: చెన్నై రిటైన్ చేసే ఆటగాళ్లు వీరే.. ధోనీకి బిగ్ షాక్?

కేటీఆర్ పై పగపడుతున్నారు. అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహించారు. ఫార్ములా రేసింగ్ పై ఏసీబీ విచారణ చేయనివ్వండి అంటూ సవాల్‌ చేశారు. ఏమీ కేసులు పెడతారో చూస్తామని హెచ్చరించారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా..? రాకపోతే నువు తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతుండేనా అంటూ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి.. కేసీఆర్ పెట్టిన బిక్ష అన్నారు. మూసీ నుంచి వాడపల్లికి వరకు రేవంత్ తో పాదయాత్రకు రెడీ అన్నారు. BRS