Allu Shirish: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీ అంటే ఎలాంటి గౌరవం ఉంటుందో మనందరికీ తెలుసు. ముఖ్యంగా చెప్పాలంటే మెగా ఫ్యామిలీకి బేస్ అల్లు ఫ్యామిలీ అని చెప్పవచ్చు. ప్రస్తుతం అల్లు ఫ్యామిలీ నుంచి సినిమా ఇండస్ట్రీలో అల్లు అరవింద్ నిర్మాతగా ఎప్పటినుంచో కొనసాగుతున్నారు. అయితే అల్లు అరవింద్ అల్లు రామలింగయ్య నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నిర్మాతగా మారారు.
Allu Shirish marriage with the girl he loves
ఇక అరవింద్ నట వారసులుగా ఇండస్ట్రీలోకి అల్లు అర్జున్, అల్లు శిరీష్ లు ఎంట్రీ ఇచ్చారు. ఇందులో అల్లు అర్జున్ మాత్రం పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటే అల్లు శిరీష్ మాత్రం గుర్తింపు కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. వీరి సినిమాల విషయాన్ని పక్కన పెడితే తాజాగా అల్లు శిరీష్ పెళ్లికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. (Allu Shirish)
Also Read: Uday Kiran: ఉదయ్ కిరణ్ చెల్లి ఓ స్టార్ సింగర్ అని మీకు తెలుసా..?
అల్లు శిరీష్ గౌరవం అనే మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఆ తర్వాత శ్రీరస్తు శుభమస్తు, ఏబిసిడి, ఊర్వశివో రాక్షసివో, ఒక్కక్షణం వంటి చిత్రాల్లో నటించారు. కానీ ఈయనకు ఏ చిత్రం కూడా అంతగా గుర్తింపు ఇవ్వలేదు. అయితే తాజాగా బడ్డి సినిమాతో మన ముందుకు వచ్చి కాస్త గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి అల్లు శిరీష్ పెళ్లి గురించి ఒక వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
అయితే ఆయన ముంబైలో యాక్టింగ్ స్కూల్లో ఉన్నప్పుడు తన క్లోజ్ ఫ్రెండ్ తో ప్రేమలో పడ్డాడని, ఈ విషయాన్ని పెద్దలకు చెప్పి తొందరలోనే వివాహం కూడా చేసుకోబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో నిజం ఎంతో అబద్ధం ఎంతో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఈ వార్త విపరీతంగా వైరల్ అవుతుంది.ఇక ఈ వార్త మాత్రమే కాకుండా గత కొద్ది రోజులుగా టాలీవుడ్ లో ఉన్న ఓ హీరోయిన్ తో కూడా అల్లు శిరీష్ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నట్టు రూమర్లు వినిపిస్తున్నాయి.(Allu Shirish)