Ka Movie Review

నటీనటులు : కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వి రామ్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్ తదితరులు.
సంగీత దర్శకుడు : సామ్ సీఎస్ (Ka Movie Review)
సినిమాటోగ్రఫీ : సతీష్ రెడ్డి మసాన్, డేనియల్ విశ్వాస్
దర్శకుడు : సందీప్, సుజిత్
నిర్మాతలు : చింతా గోపాల్ కృష్ణ రెడ్డి
విడుదలతేదీ: 2024-10-31

కథ: అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) ఓ అనాధ. ఓ అనాథాశ్రమంలో పెరిగిన వాసుదేవ్ కి చిన్నప్పటినుండి వేరేవారి ఉత్తరాలు చదివే అలవాటు వచ్చింది. అందువల్ల పోస్ట్ మ్యాన్ అవ్వాలనే కోరిక అతనిలో పెరిగింది. ఓ రోజు ఓ తప్పువల్ల అనాధాశ్రమం నుండి పారిపోతాడు. ఎక్కడెక్కడో తిరిగి చివరికి క్రిష్ణగిరి అనే ఓ ఊరిలో అసిస్టెంట్ పోస్ట్ మాన్ గా వచ్చి జాయిన్ అవుతాడు. అక్కడే పోస్ట్ మాస్టర్ గారి అమ్మాయి సత్యభామ (నయన్ సారిక) తో ప్రేమలో పడతాడు. అయితే ఆ ఊరిలో అమ్మాయిలు మిస్ అవుతుంటారు. ఆ అమ్మాయిలు ఎందుకు మిస్ అవుతుంటారు..దాన్ని వాసుదేవ్ ఎలా ఎలా చేధించాడు అనేదే సినిమా కథ.(Ka Movie Review)

నటీనటులు: కిరణ్ అబ్బవరం తన ప్రతి సినిమాలోనూ కొత్తదనం చూపించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాలో కూడా ఆయన విభిన్నమైన కాన్సెప్ట్‌ను ఎంచుకుని, తన పాత్ర చుట్టూ కథను అల్లుకున్న తీరు బాగుంది. పాత్ర కోసం ఆయన మేకోవర్ సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. సినిమా ద్వితీయార్ధంలో కిరణ్ నటన అద్భుతంగా ఉంది. రాధ పాత్రలో తన్వీ రామ్ భావోద్వేగాలను చక్కగా పలికించారు. నయన్ సారిక పాత్ర సినిమాకు గ్లామర్ తీసుకొచ్చింది. అచ్యుత్ కుమార్, రెడిన్ కింగ్ స్లే, శరణ్య, అజయ్, బలగం జయరామ్ తమ పాత్రలతో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. మిగితా పాత్రధారులు తమ పాత్రలతో ఆకట్టుకున్నారు.

సాంకేతిక విభాగం: సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. దర్శకులు సందీప్, సుజిత్ ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ను ఆసక్తికరంగా తెరకెక్కించారు. కథనం మరింత ఆసక్తికరంగా ఉంది. సతీష్ రెడ్డి మసాన్, డేనియల్ విశ్వాస్ లు అందించిన ఛాయాగ్రహణం సినిమాకు ప్రధాన ఆకర్షణ. ముఖ్యంగా కీలక సన్నివేశాలను, ద్వితీయార్ధంలో వచ్చే కొన్ని సన్నివేశాలను చాలా అందంగా చూపించారు. వారి కెమెరా పనితనం సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చింది. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం సన్నివేశాలను మరింత ఉత్కంఠభరితంగా మార్చింది. ఎడిటింగ్ కూడా చాలా క్రిస్ప్ గా ఉంది. నిర్మాత చింతా గోపాల్ కృష్ణ రెడ్డి నిర్మాణ విలువలు సినిమాకు మరింత వన్నె తెచ్చాయి. మొత్తంగా, సాంకేతిక విభాగం సినిమాకు పెద్ద బలం.(Ka Movie Review)

ప్లస్ పాయింట్స్:

నేపథ్య సంగీతం

కిరణ్ అబ్బవరం పెర్ఫార్మన్స్

స్క్రీన్ ప్లే, ట్విస్ట్స్

మైనస్ పాయింట్స్:

ఊహించే సన్నివేశాలు

తీర్పు: ప్రారంభం నుంచే సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. విభిన్నమైన కథ, కథనంతో అందంగా సాగిన ఈ సినిమా, ఇంటర్వెల్ ట్విస్ట్‌తో మరింత ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ద్వితీయార్ధంలో కథ ముందుకువెల్తూ మంచి క్లైమాక్స్‌తో ముగుస్తుంది. ప్రతి సినిమాలోనూ కొత్తదనం చూపించాలనే తపనతో, కిరణ్ అబ్బవరం ఈ సినిమాలో కూడా వినూత్నమైన కాన్సెప్ట్‌ను ఎంచుకున్నారు. తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా.

Tag Line: ట్విస్ట్ లతో ఆకట్టుకునే సస్పెన్స్ డ్రామా!!!

రేటింగ్: 3.5/5