Dhaniya Water: భారతదేశంలో ప్రతి ఇంటి వంటగదిలో ఎక్కువగా ఉపయోగించే మసాలా దినుసులలో ధనియాలు ఒకటి. ధనియాల గింజలు కొత్తిమీర తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ మసాలా దినుసు ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా ధనియాల నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. Dhaniya Water
Health Benfits With Dhaniya Water
ధనియాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ముఖ్యమైన నూనెలు ఇన్సులిన్ చర్యలను పెంచుతాయి. ఇది రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా మంచిది. ధనియాల నీరు తాగడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే ఔషధాలు ఇందులో ఉన్నాయి. Dhaniya Water
Also Read: TTD: టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు
ఖాళీ కడుపుతో ప్రతిరోజు ధనియాలను నానబెట్టిన నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. గ్యాస్ సమస్యలు తొలగిపోతాయి. బీపీ, షుగర్ పేషంట్లు ప్రతిరోజు ఉదయం పూట ధనియాలను నానబెట్టిన నీటిని తప్పకుండా తాగాలి. ముఖ్యంగా థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం పూట ధనియాలను నానబెట్టిన నీటిని తాగడం వల్ల థైరాయిడ్ తగ్గుతుంది. Dhaniya Water