Sai Pallavi ran away from the shooting

Sai Pallavi: సాయి పల్లవి డైరెక్టర్ కి భయపడి నిజంగానే షూటింగ్ నుండి పారిపోవాలి అనుకుందా.. ఇంతకీ ఆ డైరెక్టర్ చేసిన తప్పేంటి.. ఎందుకు సాయి పల్లవి డైరెక్టర్ కి భయపడింది అనేది ఇప్పుడు చూద్దాం.. సాయి పల్లవి డైరెక్టర్ కి భయపడి షూటింగ్ నుండి పారిపోవాలి అనుకున్న సినిమా ఏదో కాదు. సూర్య హీరోగా చేసిన ఎన్జీకే మూవీలో సాయి పల్లవి తో పాటు రకుల్ ప్రీత్ సింగ్ కూడా నటించింది.

Sai Pallavi ran away from the shooting

అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో సాయిపల్లవి డైరెక్టర్ ప్రవర్తనకు భయపడి సినిమా షూటింగ్ నుండి పారిపోవాలి అనుకుందట.అయితే ఈ మూవీకి డైరెక్టర్ గా ధనుష్ అన్నయ్య సెల్వ రాఘవన్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్లో తన ఆరోగ్యం సహకరించకనో ఏమో తెలియదు. కానీ సాయి పల్లవి ఆ సీన్ చేసిన ప్రతిసారి డైరెక్టర్ ప్రవర్తన వేరే విధంగా ఉండేదట. (Sai Pallavi)

Also Read: Director Krish: 10 ఏళ్ల కొడుకు ఉన్న డాక్టర్ తో డైరెక్టర్ క్రిష్ ఎఫై**..త్వరలోనే పెళ్లి..?

అసలు నా యాక్టింగ్ డైరెక్టర్ కి నచ్చిందో లేదో అని సాయి పల్లవి ప్రతిసారి అనుమానపడేదట. దాంతో ఆయన ప్రవర్తనకు భయపడి వెంటనే షూటింగ్ సెట్ నుండి పారిపోవాలి అనుకుందట. కానీ ఆ తర్వాత ధనుష్ ఫోన్ చేసి ఎలా ఉంది..ఎన్ జి కే సెట్ అని అడగడంతో అప్పటికే ధనుష్ తో పనిచేసిన అనుభవం ఉన్న సాయి పల్లవి మీ అన్నయ్య ఇలా ఉంటున్నారు..

Sai Pallavi ran away from the shooting

ఆయన నేను షాట్ చేసిన తర్వాత ఎలా ఉందో కూడా చెప్పడం లేదు అని చెప్పడంతో సెల్వ ని సహనాన్ని పరీక్షిస్తున్నాడు.నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు అని ధనుష్ సర్ది చెప్పారట. ఇక ధనుష్ మాటలతో షూటింగ్లో ధైర్యంగా నటించాను అంటూ రీసెంట్గా ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయాన్ని చెప్పింది సాయి పల్లవి.(Sai Pallavi)