Niharika: ఏంటి నిహారిక మాజీ భర్త నిజంగానే ఆ హీరోయిన్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోబోతున్నారా.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల్లో ఉన్న నిజమెంత అనేది ఇప్పుడు చూద్దాం.. మెగా డాటర్ నిహారిక జొన్నలగడ్డ చైతన్యతో విడాకుల తర్వాత సినిమాల్లో యాక్టివ్ అయిపోయింది. పలు వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ నిర్మాతగానే కాకుండా పలు సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేస్తోంది.
Is Niharika husband second marriage fixed with that heroine friend
ఇక రీసెంట్గా నిహారిక తెరకెక్కించిన కమిటీ కుర్రాళ్ళు మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పనక్కర్లేదు.ఈ సినిమాతో నిహారిక క్రేజ్ మరింత పెరిగిపోయింది అని చెప్పుకోవచ్చు. అయితే అలాంటి నిహారిక సినీ కెరీర్ బాగున్నప్పటికీ పర్సనల్ కెరియర్ మాత్రం బాగోలేదు. ఆమె పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొని రెండేళ్లకే విడాకులు తీసుకుంది. వీరి విడాకులు ఇండస్ట్రీలో పెద్ద సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు.కానీ మెగా ఫ్యామిలీలో ఇవన్నీ కామన్ గానే ఉంటాయి.(Niharika)
Also Read: Suriya: జ్యోతిక కాదు అన్నయ్యకి ఆ హీరోయిన్ అంటే ఇష్టం.. సూర్య కాపురంలో చిచ్చుపెట్టిన కార్తీ.?
ఎందుకంటే ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కి ఎంగేజ్మెంట్ అయి బ్రేక్ అయింది. ఆ తర్వాత రెండో కూతురు శ్రీజ కూడా మొదటిసారి ప్రేమ వివాహం చేసుకొని విఫలమైంది. రెండోసారి పెద్దలకు కుదిర్చిన పెళ్లి చేసుకొని అది కూడా విడాకులు తీసుకుంది. అలా ఈమె రెండు పెళ్లిళ్లు చెడిపోయాయి.ఇక నాగబాబు కూతురు నిహారిక విషయంలో కూడా ఇదే జరిగింది. పెద్దలు కుదిర్చిన పెళ్లి కూడా ఈమెకు అచ్చిరాలేదని చెప్పుకోవచ్చు.
అయితే అలాంటి నిహారిక మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య గురించి సోషల్ మీడియాలో ఒక టాక్ వినిపిస్తోంది. అదేంటంటే నిహారిక ఓ హీరోయిన్ ఫ్రెండ్ ని పెళ్లాడబోతున్నారట. ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు నిహారికనే.. మెగా డాటర్ నిహారిక ఫ్రెండ్ తో జొన్నలగడ్డ చైతన్య పెళ్లి అంటూ సామాజిక మాధ్యమాల్లో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఈ వార్తలు పూర్తిగా అవాస్తమే అని కొంతమంది మెగా ఫ్యాన్స్ కొట్టి పారేస్తున్నారు. కేవలం వ్యూస్ అండ్ లైక్స్ కోసమే ఇలాంటి చెత్త వార్తలు ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు.(Niharika)