Journalists Upset Over Limited Q&A at Thandel

Thandel: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన “తండేల్ ” సినిమా విడుదల తేదీని ప్రకటించేందుకు చిత్ర బృందం నిన్న ప్రెస్ మీట్ నిర్వహించింది. అయితే ఈ సమావేశంలో వారు మీడియా పట్ల చూపిన తీరు, పాత్రికేయులకు నిరాశ కలిగించింది. ప్రెస్ మీట్‌లో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే, కేవలం ఐదు ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు ఇవ్వడం, త్వరగా సమావేశాన్ని ముగించడం తదితర నిర్ణయాలపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Journalists Upset Over Limited Q&A at Thandel

చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముందే, కేవలం కొన్ని ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది చిత్ర బృందం. ఈ నిర్ణయం వల్ల జర్నలిస్టులకు ప్రశ్నలు అడగడానికి తగిన అవకాశాలు లేకుండా పోయాయి. ప్రెస్ మీట్ నిర్వహించేటప్పుడు, ముఖ్యమైన విషయాలను మీడియాతో పంచుకోవడం ముఖ్యం అని జర్నలిస్టులు భావిస్తారు. కానీ, “తండేల్” టీం కేవలం హడావిడిగా సమావేశాన్ని ముగించడం వలన ఇది అవసరం లేకుండా పోయిందని వారు అంటున్నారు. ” అలాంటప్పుడు ప్రెస్ మీట్ నిర్వహించాల్సిన అవసరం ఏముంది? పూర్తి స్థాయి సమావేశం నిర్వహించి మీడియాతో విషయాలు పంచుకోవాల్సిన అవసరం ఉన్న సమయంలో సడెన్ గా వెళ్లిపోవడం తో పూర్తిగా రద్దు చేయలేదు?” అనే ప్రశ్నలు మీడియా వర్గాలలో వినిపిస్తున్నాయి.

Also Read: Rana Daggubati: మహేష్ బాబు, రవితేజ లను దారుణంగా అవమానించిన రానా, తేజ సజ్జ!!

జర్నలిస్టులు అడిగే ప్రశ్నల వల్లనే చిత్ర బృందం ఈ విధమైన నిర్ణయం తీసుకుని ఉండవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో జర్నలిస్టులు అడిగే ప్రశ్నలు వివాదాలకు దారి తీస్తాయని భావించి, ఈ ప్రెస్ మీట్‌లో పాత్రికేయులను పరిమితం చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రెస్ మీట్ లో ప్రశ్నల సంఖ్యను తగ్గించడం, ప్రశ్నలు అడిగే పాత్రికేయుల ముఖాలను చూపించకుండా కేవలం వారి వాయిస్ మాత్రమే వినిపించేలా చేయడం, నటులు నాగ చైతన్య, సాయి పల్లవి వంటి ప్రధాన సబ్జెక్టులు సమావేశానికి రాకపోవడం వంటి విషయాలు వివాదాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే తీసుకున్న నిర్ణయాలు అన్న అభిప్రాయాలు ఉన్నాయి.

“తండేల్ ” టీం ఈ విధానంపై సినీ జర్నలిస్టులు, సినిమా వెబ్ సైట్‌లు, సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. “ఇలాంటి ప్రెస్ మీట్ నిర్వహించడంలో ఉద్దేశం ఏమిటి? నిజంగా సినిమాకు మద్దతుగా జరిగే ఈ సమావేశాలు నిష్పత్తిగా ఉండాలన్నది జర్నలిస్టుల వాదన. ప్రెస్ మీట్ నిర్వాహణ విధానాలు మంచి మార్కెటింగ్ సాధనంగా మారితేనే సినిమా ప్రమోషన్ సక్సెస్ అవుతుందని వారు భావిస్తున్నారు. “తండేల్ ” సినిమాకు ఈ వివాదం ప్రమోషన్స్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.

https://twitter.com/pakkafilmy007/status/1853760776479330813