Did Tripti Dimri become a mother without marriage

Tripti Dimri: సినిమాలు అంటే ఇష్టపడే చాలామంది అభిమానులకు హీరోయిన్ త్రిప్తి డిమ్రి తెలియకుండా ఉండరు.. అలాంటి ఈమె సినీ ఫీల్డ్ లోకి అడుగుపెట్టి గుర్తింపు కోసం ఎంతో కష్టపడింది. ముందుగా ఎన్నో చిత్రాల్లో నటించినా ఆమెకు రాణి గుర్తింపు, ఆ ఒక్క సినిమా ద్వారా మాత్రం వచ్చింది.. ఇంతకీ ఆ సినిమా ఏంటయ్యా అంటే యానిమల్..

Did Tripti Dimri become a mother without marriage

ఈ సినిమాలో రెండవ భాగంలో బోల్డ్ బ్యూటీగా రణ్బీర్ కపూర్ ప్రియురాలిగా నటిస్తుంది. ఈ సినిమా కోసం ఆమె అర్ధనగ్నంగా ఒక పాటకు డాన్స్ చేయడంతో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది. ఈ విధంగా ఓవర్ నైట్ లోనే కుర్రాళ్ళ కలల రాకుమారిగా మారిపోయిందని చెప్పవచ్చు.. అలా ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రావడం లేదు..(Tripti Dimri)

Also Read: “లగ్గం టైమ్‌” ఫస్ట్‌లుక్ లాంచ్ చేసిన భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర..!

అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా ధడక్ అనే చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా తన జీవితంలో జరిగినటువంటి చాలా విషయాలను పంచుకుంది. అంతేకాదు తాను పెళ్లి కాకముందే తల్లిని అయ్యానని కూడా చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆమె ఏమన్నది ఆ వివరాలు ఏంటో చూద్దాం.. ఈమె సినిమాల్లో సెట్ అవుదాం అనుకున్న సమయంలో ముందుగా ముంబైలోని లెనోవో యాడ్ కంపెనీ వారితో అగ్రిమెంట్ చేసుకుంది. వారి యాడ్ కోసం ఆఫర్ వచ్చినప్పుడల్లా ముంబై వెళ్లేదట.

Did Tripti Dimri become a mother without marriage

ఇక దీని తర్వాత సంతూర్ సోప్ యాడ్ లో నటించే అవకాశం తృప్తికి లభించింది. ఈ యాడ్ లో పెళ్లికాకముందే 22 ఏళ్లకే సంతూర్ యాడ్ లో ఒక పాపకు తల్లినయ్యానని, నవ్వుకుంటూ చెప్పింది. ఈ ముద్దుగుమ్మ యానిమల్ మూవీ తర్వాత న్యూజ్ సినిమా భారీ హిట్ అయింది.. అలాంటి ఈమె తాజాగా ధడక్ అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది..(Tripti Dimri)