Jr NTR Serious Incident: యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్టార్ గా ప్రసిద్ధి చెందారు. “ఆర్ఆర్ఆర్” సినిమా ద్వారా అంతర్జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు పొందిన తారక్, ఆస్కార్ అవార్డు వేడుకలో కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా అనంతరం “దేవర” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్, తన అద్భుతమైన నటనతో టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు, ఆయన ప్రధానంగా పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడు.
Jr NTR Serious Incident During Movie Shoot
ఎన్టీఆర్ సినిమా జీవితంలో ఎన్నో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. వాటిలో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన బాల్యంలో “బాల రామాయణం” సినిమాతో నటించిన సమయంలో, ఎన్టీఆర్ దర్శకుడు గుణశేఖర్ పై అలిగిన సంగతి తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో, ఎన్టీఆర్ చిన్న రాముడి పాత్రలో నటించాడు. సినిమా షూటింగ్ సమయంలో, చిన్న పిల్లలు అంతా అల్లరి చేసేవారు, కానీ ఎన్టీఆర్ ఇతరులతో పోల్చితే ఎక్కువగా అల్లరి చేసేవాడని చెబుతారు.
Also Read: KTR Padayatra: కేటీఆర్ పాదయాత్ర.. బీఆర్ఎస్ లో కొత్త చర్చ.. హరీష్ రావు..కవిత పరిస్థితి ఏంటి?
ముఖ్యంగా యుద్ధ సన్నివేశాల కోసం తెచ్చిన బాణాలను విరగొట్టడం, శివ ధనుర్భంగం సీన్ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన టేకు విల్లును కూడా విరగొట్టడం వంటి అల్లరులు చేసేవాడని అంటున్నారు. ఈ అల్లరి కారణంగా, దర్శకుడు గుణశేఖర్ కోప్పడ్డారని తెలుస్తోంది. అంతేకాకుండా, టేకు విల్లు విరగొట్టడంతో, గుణశేఖర్ ఎంతో కోపంతో ఎన్టీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడని వినికిడి.
ఈ సంఘటన తర్వాత, ఎన్టీఆర్ “నేను ఈ సినిమా చేయను, ఇంటికి వెళ్ళిపోతాను” అని ఆగ్రహంగా వ్యాఖ్యానించాడట. పరిస్థితి మరింత చెడ్డగా మారడంతో, గుణశేఖర్ మరియు ఇతర యూనిట్ సభ్యులు ఎంతో ప్రాధేయపడి, చివరికి ఎన్టీఆర్ షూటింగ్ కి తిరిగి రావాలని ఒప్పించారు. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది, అటువంటి వినోదాత్మక ఘటనలు కూడా ఎన్టీఆర్ సినిమాటిక్ కెరీర్ లో భాగమవుతున్నాయి.