నటీనటులు: రాకేష్ వర్రే ( Jithender Reddy ), వైశాలి రాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ తదితరులు..
దర్శకుడు: విరించి వర్మ
నిర్మాత: ముదుగంటి రవీందర్ రెడ్డి
సహ నిర్మాత: ఉమ రవీందర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వాణిశ్రీ పొడుగు
ఛాయాగ్రాహకులు: వీ ఎస్ జ్ఞాన శేఖర్
సంగీత దర్శకులు: గోపి సుందర్
ఎడిటర్: రామకృష్ణ అర్రం
పీఆర్: మధు వి ఆర్
విడుదల తేదీ: 07-11 -2024
Jithender Reddy Review: A High Voltage Action Drama on Patriotism
Jithender Reddy: దేశం కోసం నిస్వార్థంగా పనిచేసే స్వయంసేవకుల జీవిత కథలు తెరకెక్కడం చాలా అరుదు. మన మాజీ ప్రధాన మంత్రులు అటల్ బిహారి వాజ్‌పేయి, నరేంద్ర మోదీ లు కూడా తమ ప్రస్థానాన్ని స్వయంసేవకులుగా మొదలుపెట్టి, దేశ అత్యున్నత పదవులను చేపట్టారు. అలాంటి గొప్ప నాయకులు ఎదగడంలో క్షేత్రస్థాయిలో పనిచేసే ఆర్ఎస్ఎస్ స్వయంసేవకుల పాత్ర ఎన్నటికీ మరవలేనిది. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ కు చెందిన ఒక స్వయంసేవకుడి జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘జితేంద్ర రెడ్డి’ ప్రేక్షకులను ఆసక్తిపరిచిన ఈ సినిమా ఎలా ఉందో ఈ సమీక్షలో తెలుసుకుందాం.
కథ: RSS భావజాలంతో పనిచేసే జితేందర్ రెడ్డి (రాకేష్ వర్రే) కుటుంబం స్వయం సేవకులుగా తమదైన సేవలను అందిస్తున్నారు. దేశంకోసం ప్రాణాలు సైతం లెక్కచేయని జితేందర్ రెడ్డి నక్సల్స్ చేసే అన్యాయాలపై పోరాటం చేయడానికి చిన్నప్పుడు జరిగిన ఓ హత్య ప్రేరణ ఇస్తుంది. ప్రజలకు అండగా నిలిచే నక్సల్స్ వ్యవస్థ ఇప్పుడు ఆ ప్రజలనే తమ స్వార్ధాలకోసం పీడిస్తోందని వారిపై తిరుగుబాటు చేస్తాడు. అలా వారి ఆగ్రహానికి గురైన జితేందర్ రెడ్డి ఎలాంటి పోరాటం చేసాడనేదే ఈ సినిమా కథ.
నటీనటులు: రాకేష్ వర్రే ఈ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాలో మెయిన్ రోల్ చేయడం విశేషం. జితేందర్ రెడ్డి (Jithender Reddy) పాత్రలో జీవించాడు. ఆ పాత్రలో ఒదిగిపోయిన తీరు,చూపించిన హావభావాలు బాగున్నాయి. సినిమా కోసం ఆయన ఎంతగా కష్టపడ్డారో ప్రతి సన్నివేశంలో స్పష్టంగా తెలుస్తుంది.విద్యార్థి నాయకుడిగా,పీడీఎస్‌యూ నేత గా తన నటనతో మంచి ప్రదర్శన కనపరిచాడు. సమాజ సేవ చేసే వ్యక్తిగా ఆయన పాత్రను చాలా సహజంగా ఉంది. ప్రతినాయక పాత్రలో నక్సలైట్ లీడర్ గా ఛత్రపతి శేఖర్ నటనను కూడా అభినందించాల్సిందే. పాత్రలోని తీవ్రత సరిగ్గా మైంటైన్ చేశాడు. గోపన్న గా సుబ్బరాజు నటన చాల బాగుంది.ప్రతి సన్నివేశంలో అద్భుతంగా నటించి ఆ పాత్రకు మంచి పేరు తీసుకొచ్చాడు. చాలా రోజుల తర్వాత ఆయనకు మంచి పాత్ర ఈ సినిమా ద్వారా లభించింది. మిగిలిన నటీనటులు తమ పరిధిలో ఉన్న పాత్రలకు న్యాయం చేశారు. వారు తమ పాత్రల ద్వారా కథకు సహకరించారు.
సాంకేతిక నిపుణులు: దర్శకుడు సినిమా నుంచి మంచి మెసేజ్ ఇచ్చ్చాడు. ముఖ్యంగా డైలాగ్స్ ఎంతో పదునుగా ఉన్నాయి. “దేశం అంటే మట్టి కాదు, మనుషులు… సమాజం మనకు ఏం ఇచ్చిందని కాదుగానీ, మనం సమాజానికి ఏం ఇచ్చామనేదే ముఖ్యమని” వచ్చే డైలాగ్స్ ప్రేక్షకుల హృదయాలను తాకేలా ఉన్నాయి.సనాతన ధర్మం కోసం పోరాడే యోధుడి కథను సీరియస్ గా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు.క్లైమాక్స్ ఎమోషనల్‌గా తీసి పరిస్థి ఒక్కరితో కంటతడి పెట్టించాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా ను వేరే లెవెల్ కి తీసుకెళ్లింది. . పాటలు కొంచెం నెమ్మదిగా ఉన్నా, చివర్లో నక్సలైట్లు చేతిలో ప్రాణాలు కోల్పోయిన స్వయంసేవకుల్ని గుర్తుచేస్తూ వచ్చే పాట మాత్రం కంట తడిపెట్టేలా ఉంటుంది.నిర్మాణ విలువలు, దర్శకుడి దృక్పథం, కథా కథనాలు అన్నీ కలసి సినిమా ఒక మంచి అనుభూతిని అందిస్తాయి. ఆ కాలపు వాతావరణాన్ని ప్రామాణికంగా చూపించడంలో చిత్ర బృందం విజయం సాధించింది.
ప్లస్ పాయింట్స్:
కథ, నటీనటుల నటన
సెకండ్ హాఫ్ , క్లైమాక్స్
దర్శకత్వం
మైనస్ పాయింట్స్:
పెద్ద నటులు లేకపోవడం
ఈ సినిమా చేయడం సాహసంతో కూడిన పని అనే చెప్పాలి. స్వయంసేవకులు నిరంతరం సమాజ సేవలో నిమగ్నమై ఉంటే, ఈ నక్సలైట్లు ప్రగతికి పెద్ద అడ్డుగోడలా నిలుస్తున్నారు. ఈ అంశాన్ని తెరపై ఎంతో నిజాయితీతో దర్శకుడు చూపించే ప్రయత్నం చేశాడు. ఈ చిత్రంలోని సన్నివేశాలు, పాత్రలు కేవలం కథతోనే కాకుండా మనస్సుకు తగిలేలా తీర్చిదిద్దడం విశేషం..(Jithender Reddy)
రేటింగ్: 3.5/5
ట్యాగ్ లైన్: నిజమైన నాయకుడు ఎవరో చూపించే కథ