KTR: గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సంచలన ప్రకటన చేశాడు. తనను అన్యాయంగా రేవంత్ రెడ్డి అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని… ఒకవేళ నన్ను అరెస్టు చేసిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని తెలిపాడు. ఈ కారు రేసింగ్ లో స్కామ్ జరగలేదని… ఏడాదికి 700 కోట్లు లాభం వచ్చేలా ప్లాన్ చేసినట్లు కేటీఆర్ గుర్తు చేశారు. KTR
KTR Sensational Comments on Arrest Formula E Car Race
50 కోట్ల స్కాం జరిగిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఈ కేసులో తప్పుడు కేసులు పెట్టేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని ఆగ్రహించారు. ఒకవేళ నిజంగానే తనపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తే… మూడు నెలపాటు జైల్లో యోగా చేస్తానని తెలిపారు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మూడు నెలలపాటు యోగా చేసి… స్లిమ్ గా తయారై ఆ తర్వాత పాదయాత్ర చేస్తానని కూడా చురకలాంటించారు కేటీఆర్. KTR
Also Read: KTR: త్వరలోనే జైలుకు పొంగులేటి… బాంబు పేల్చిన కేటీఆర్ ?
ఈ- కార్ రేసింగ్ ను రద్దు చేసిన రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ పరువు తీశాడని… అలాగే రేసింగ్ కాంట్రాక్ట్ ను రద్దు చేశాడని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తిని అరెస్టు చేయాలి కానీ… తనను కాదన్నారు. ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలు మర్చిపోవాలని… రేవంత్ రెడ్డి ఇలా అరెస్టుల పేరుతో తప్పుడు వార్తలు రాయిస్తున్నాడని నిప్పులు చెరిగారు కేటీఆర్. అరెస్టులకు ఎవరు భయపడబోరని తెలిపారు. KTR