నటీనటులు : చేతన్ కృష్ణ, (Dhoom Dhaam Movie Review) హెబ్బా పటేల్, సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ తదితరులు
స్టోరీ స్క్రీన్ ప్లే : గోపీ మోహన్
డైరెక్టర్ : సాయి కిషోర్ మచ్చా
ఎడిటింగ్ : అమర్ రెడ్డి కుడుముల
సినిమాటోగ్రఫీ : సిద్ధార్థ్ రామస్వామి
మ్యూజిక్ : గోపీ సుందర్
ప్రొడ్యూసర్ : ఎంఎస్ రామ్ కుమార్
విడుదల తేదీ: 08-11-2024
Dhoom Dhaam Movie Review
Dhoom Dhaam Movie Review: చైతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటించిన ‘ధూం ధాం’ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంపై విడుదలకు ముందే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ట్రైలర్, పోస్టర్లు ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఈ చిత్రంలో సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ వంటి నటులు ముఖ్య పాత్రలు పోషించారు. దర్శకుడు సాయి కిషోర్ మచ్చా ఈ చిత్రానికి సారథ్యం వహించగా, ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మాణం చేపట్టారు. ఈ చిత్రానికి ప్రముఖ రైటర్ గోపీ మోహన్ కథ, స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకుందో ఈ సమీక్షలో తెలుసుకుందాం.
కథ: కార్తీక్ (చేతన్ కృష్ణ) కి తండ్రి (సాయి కుమార్) అంటే చాలా ఇష్టం. తండ్రికి కూడా కార్తీక్ అంటే ఇంకా ఇష్టం. ఒకరికోసం ఒకరు ఏవైనా చేస్తారు. అలాంటి వీరిమధ్య కి సుహానా (హెబ్బా పటేల్) వస్తుంది. పందెంలో గెలవడానికి సుహానా అతన్ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ క్రమంలో నిజంగానే ప్రేమలో పడుతుంది. నిజం తెలిసిన కార్తీక్ సుహానా ని అవాయిడ్ చేస్తాడు. ఒకానొక దశలో కార్తీక్ కూడా సుహానాని ప్రేమిస్తాడు. అయితే ఈ విషయం తన తండ్రికి చెప్పాలని సుహానా ప్రయత్నిస్తుండగా సుహానా తండ్రిని చుసిన కార్తీక్ గతంలో వారిద్దరిమధ్య జరిగిన ఓ ఇన్సిడెంట్ వల్ల భయపడి ఆమె తండ్రిని కలవడాన్ని ఎవాయిడ్ చేస్తాడు. ఈ విషయం కార్తీక్ తన తండ్రికి చెప్పగానే అతను కూడా ఆ కుటుంబానికి చేసిన ఓ తప్పు గుర్తుకు తెచ్చుకుంటాడు. కార్తీక్ కోసం అతని తండ్రి చేసిన ఆ పెద్ద తప్పు కారణంగా సుహానా కుటుంబం ఈ సమస్యలతో ఎలా ముడిపడి పోయిందో, వారి జీవితాలను ఎలా కదిలించిందో అనేదే ఈ సినిమా కథ.
Also Read: Vaishnav Tej: శ్రీలీల కాదు.. ఆ హీరోయిన్ తో వైష్ణవ్ తేజ్ పెళ్లి..?
నటీనటులు: సినిమాలో హీరోగా చేసిన చేతన్ కృష్ణ తన పాత్రలో ఒదిగిపోయాడు. తన హావభావాలతో పాత్ర ను ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాడు. ఎమోషనల్ సీన్లలో ఇంకా కొంత అభివృద్ధి అవసరమని అనిపిస్తుంది. హీరోయిన్ హేబా పటేల్ ఈ సినిమాతో చాలా రోజుల తర్వాత కమర్షియల్ హీరోయిన్‌గా మళ్లీ ప్రేక్షకులను అలరించింది. తనను స్టార్‌గా నిలబెట్టిన ప్రేమ కథల్లో మళ్లీ మెరిసిన హెబ్బా మనసుకు హత్తుకునే నటనను చూపించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. సాయి కుమార్ తండ్రి పాత్రలో మరోసారి ఆకట్టుకున్నాడు. వెన్నెల కిశోర్ మరోసారి తన కామెడీతో ప్రేక్షకులను అలరించాడు. తన నటన సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ముఖ్యంగా సెకండాఫ్‌లో పూర్తిగా తన భుజాలపై కథన్నితీసుకెళ్లారు. అతని కామెడీ టైమింగ్, హావభావాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. వీరితో పాటు గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, గిరిధర్, నవీన్ కూడా తమ నటనతో అలరించారు. ప్రతి పాత్రలోని నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేసి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.
సాంకేతిక నిపుణులు: సంగీత దర్శకుడు గోపీ సుందర్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన బలం. పాటలతో ఆకట్టుకోవడంతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో సినిమా స్థాయిని పెంచాడు. కెమెరామెన్ సిద్ధార్థ్ రామస్వామి విజువల్స్ తో ఈ సినిమాకు ప్రత్యేకమైన అందాన్ని తీసుకొచ్చాడు.అమర్ రెడ్డి కుడుముల ఎడిటింగ్ ప్రతిభ సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. కథలోని కొన్ని ల్యాగ్ అనిపించే సందర్భాలను కట్ చేసే విధానం, సన్నివేశాల మధ్య సరైన సింక్‌ను అందించడం సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. నిర్మాత ఎంఎస్ రామ్ కుమార్ ప్రొడక్షన్ వాల్యూస్ గొప్పగా ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దర్శకుడు గురించి. కథ, కథనాలు బాగా రాసుకున్నాడు. డైలాగ్స్ కూడా బాగున్నాయి. సున్నితమైన మలుపులను, భావోద్వేగాల్ని చూపించిన విధానం చాల బాగుంది. ఏదేమైనా దర్శకుడు సాయి కిషోర్ కృషి, ప్రతిభ సినిమాకి ప్రధాన బలం అయ్యాయి.
ప్లస్ పాయింట్స్ :
సంగీతం
వెన్నెల కిషోర్ కామెడీ
సెకండ్ హాఫ్
మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్
తీర్పు: ఇటీవల కాలంలో మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలు తక్కువగా వస్తున్నాయి. యాక్షన్, రా, రస్టిక్ నేపథ్యాల కథలకు ఎక్కువ ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో, చాలా మంది మేకర్స్ అలాంటి సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫ్యామిలీ అంతా కలిసి చూడగల సినిమాల సంఖ్య తగ్గిపోవడంతో, పద్దతిగా ఉన్న ప్రేమ కథలు, కుటుంబ బంధాలను, భావోద్వేగాలను ప్రదర్శించే చిత్రాల లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆ లోటును భర్తీ చేయాలనే లక్ష్యంతో ‘ధూం ధాం’ సినిమా గా రాగా ఫ్యామిలీ అంతా చూడదగ్గ చిత్రంగా ఈ సినిమా ప్రశంశలు అందుకుంటుంది.
రేటింగ్: 3/5
టాగ్ లైన్: క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ధూం ధాం’